సివిల్స్‌ పోస్టులు గత అయిదేళ్లలో కనిష్టం | Govt to hire 980 officers through civil services exam, lowest in 5 years | Sakshi
Sakshi News home page

సివిల్స్‌ పోస్టులు గత అయిదేళ్లలో కనిష్టం

Published Mon, Feb 27 2017 7:09 PM | Last Updated on Sat, Sep 22 2018 7:37 PM

Govt to hire 980 officers through civil services exam, lowest in 5 years

న్యూఢిల్లీ: అఖిల భారత సర్వీసుల్లో భర్తీ కోసం 980 ఖాళీలతో యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) జారీ చేసిన నోటిఫికేషన్‌ సంఖ్యాపరంగా గత అయిదేళ్లలో అత్యల్పంగా నిలువనుంది.  2011లో కేవలం 880 ఖాళీల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. గతేడాది 1,079 ఖాళీలను, 2015లో 1,164 పోస్టులను భర్తీ చేసింది. 2013లో 1,228, 2014లో 1,364 పోస్టులను భర్తీ చేసింది.

ఈ ఏడాది జూన్ 18న సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రిలిమ్స్‌–2017కు మార్చి 17 సాయంత్రం ఆరుగంటల వరకే దరఖాస్తులు స్వీకరిస్తామని యూపీఎస్సీ స్పష్టం చేసింది. మెయిన్స్  పరీక్ష అక్టోబర్‌లో నిర్వహించే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement