Lowest
-
బాబోయ్ రూపాయ్
కీలక కరెన్సీగా చలామణీ అవుతున్న డాలర్ మారకంలో రూపాయి విలువ నానాటికీ తగ్గిపోతోంది. తాజాగా బుధవారం 17 పైసలు పతనమై మరో కొత్త కనిష్ట స్థాయి 85.91కి క్షీణించి 86 స్థాయికి మరింత చేరువైంది. గతేడాది మొత్తం మీద చూస్తే రూపాయి విలువ 3 శాతం కరిగిపోయింది. అంతర్జాతీయంగా భౌగోళిక .. రాజకీయ అనిశ్చితి, మన మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం, మిగతా కరెన్సీలతో పోలిస్తే డాలరు బలపడుతుండటం, పెరుగుతున్న వాణిజ్య లోటు .. ముడి చమురు రేట్లులాంటి అంశాలు రూపాయి పతనానికి కారణమవుతున్నాయి. ఇలా రూపాయి రోజురోజుకూ సెంచరీకి దగ్గరవుతుండటం పలు వర్గాలను కలవరపెడుతోంది. రూపాయి పడిపోవడం కొన్ని ఎగుమతుల ఆధారిత రంగాలకు లాభించేదే అయినా.. దిగుమతుల ఆధారిత రంగాలకు మాత్రం బిల్లుల మోత మోగిపోతోంది. విదేశీ విద్య కూడా భారమవుతోంది. ఈ నేపథ్యంలోనే రూపాయి పతనంతో ప్రభావితమయ్యే అంశాలపై ప్రత్యేక కథనం. ఎగుమతి చేసే ఆటో కంపెనీలకు ఓకే.. వాహనాలను ఎగుమతి చేస్తున్న బజాజ్ ఆటో, మారుతీ సుజుకీ వంటి దేశీ ఆటోమొబైల్ కంపెనీలకు రూపాయి క్షీణత లాభించనుంది. అలాగే, ఆటో విడిభాగాల తయారీ సంస్థల ఆదాయాల్లో కూడా ఎక్కువ భాగం ఎగుమతుల నుంచి వస్తుండటంతో వాటికి కూడా ప్రయోజనకరంగానే ఉంటుంది. భారత ఆటోమొబైల్ విడిభాగాల ఎగుమతుల్లో అమెరికా వాటా ఏకంగా 33 శాతంగా ఉంటోంది. మరోవైపు, దిగుమతుల ఆధారిత లగ్జరీ కార్ల తయారీ సంస్థలైన మెర్సిడెస్–బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి, వోల్వోలాంటి కంపెనీలకు మాత్రం రూపాయి పతనం ప్రతికూలమే అవుతుంది. ఐటీ, ఫార్మా హ్యాపీస్... దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగానికి రూపాయి క్షీణత బాగా లాభిస్తుంది. చాలామటుకు సంస్థల ఆదాయాలు డాలర్లలోనే ఉండటం వల్ల రూపాయి 1 శాతం క్షీణిస్తే ఐటీ కంపెనీల ఆదాయం సుమారు 0.5 శాతం, లాభం దాదాపు 1.5 శాతం పెరుగుతుందని అంచనా. మూడో త్రైమాసికంలో డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 125 పైసలు పైగా పతనమైంది. దీంతో ఐటీ సంస్థల మార్జిన్లు 30–50 బేసిస్ పాయింట్లు (0.30–0.50 శాతం) వరకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, ఇదే సమయంలో చైనా యువాన్, జపనీస్ యెన్, మెక్సికన్ పెసోలాంటివి కూడా పతనం కావడం వల్ల ఆకర్షణీయమైన రేటుకు సేవలు అందించడంలో మన సంస్థలకు పోటీ పెరిగిపోతోంది. ఇక ఫార్మా విషయానికొస్తే.. మన ఫార్మా ఎగుమతుల్లో మూడో వంతు వాటా అమెరికా మార్కెట్‌దే ఉంటోంది కాబట్టి ఎగుమతి కంపెనీలకు రూపాయి పతనం సానుకూలంగా ఉంటుంది. అయితే, రూపాయి క్షీణత వల్ల.. దేశీ మార్కెట్‌పై ఫోకస్ పెట్టే సంస్థలకు వ్యయాలు పెరుగుతాయి.దిగుమతులకు భారం.. చమురు, పసిడి మొదలైన వాటి కోసం భారత్ ప్రధానంగా దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. పెట్రోల్‌తో మొదలెడితే ప్లాస్టిక్, ఎరువుల వరకు మనకు నిత్యం అవసరమయ్యే అనేక ఉత్పత్తులు, సర్వీసుల్లో క్రూడాయిల్ కీలకపాత్ర పోషిస్తోంది. ఆయిల్ రేటు పెరిగిందంటే.. దానికి సంబంధమున్న వాటన్నింటి రేట్లూ పెరుగుతాయి. రూపాయి మారకం విలువ వచ్చే ఏడాది వ్యవధిలో సగటున ప్రస్తుత స్థాయిలోనే ఉంటే దిగుమతుల బిల్లు భారం ఏకంగా 15 బిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ. 1.27 లక్షల కోట్లు) పెరగవచ్చని అంచనా. కరెన్సీ బలహీనపడటం వల్ల వంటనూనెలు, పప్పులు, యూరియా, డీఏపీలు మొదలైన దిగుమతులపై ప్రభావం ఎక్కువగా పడుతుంది. ప్రస్తుతం భారత్‌లో అసెంబుల్ చేసే స్మార్ట్ఫోన్లలో 80–90 శాతం వరకు దిగుమతి చేసుకున్న విడిభాగాలు ఉంటున్నాయని, ఫలితంగా రూపా యి క్షీణత వల్ల స్మార్ట్ఫోన్లతో పాటు ఎల్రక్టానిక్స్ ఉత్పత్తులు ప్రియమవుతాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఎల్రక్టానిక్స్‌కు సంబంధించి కరెన్సీ విలువ 5 శాతం క్షీణిస్తే వ్యయాలు 2 శాతం పెరుగుతాయని అంచనా. థర్మల్ విద్యుత్ ప్లాంట్ల కోసం దిగుమతి చేసుకున్న బొగ్గును కూడా వాడుతుంటారు. మారకం విలువ ఒక్క రూపాయి మారినా.. దిగుమతి చేసుకున్న బొగ్గుతో నడిచే పవర్ ప్రాజెక్టుల్లో ఉత్పత్తి చేసే విద్యుత్ వ్యయాలు యూనిట్‌కి 4 పైసల మేర మారిపోతాయి. విదేశాల్లో చదువు.. తడిసిమోపెడు.. చాలామటుకు అంతర్జాతీయ యూనివర్సిటీలు విదేశీ కరెన్సీల్లోనే (డాలరు, పౌండ్లు, యూరోల్లాంటివి) ట్యూషన్ ఫీజులు వసూలు చేస్తాయి. దీంతో రూపాయి బలహీనపడే కొద్దీ ఫీజుల భారం పెరుగుతుంటుంది. అలాగే విద్యాభ్యాసం కోసం అక్కడ నివసించే భారతీయ విద్యార్థుల రోజువారీ ఖర్చులు (ఇంటద్దె, ఆహారం, రవాణా మొదలైనవి) మన మారకంలో చూసుకుంటే పెరిగిపోతాయి. ఉదాహరణకు సగటున 50,000 డాలర్ల ట్యూషన్ ఫీజును పరిగణనలోకి తీసుకుంటే, గతేడాది రూపాయి విలువ 3 శాతం పడిపోవడంతో, జనవరిలో సుమారు రూ. 41.39 లక్షలుగా ఉన్న ట్యూషన్ ఫీజు .. డిసెంబర్ నాటికి రూ. 42.90 లక్షలకు పెరిగింది. అంటే డాలరు రూపంలో ఫీజు అంతే ఉన్నా.. రూపాయి విలువ పడిపోవడంతో కేవలం పన్నెండు నెలల్లో ఏకంగా రూ. 1.51 లక్షలకు పైగా భారం పెరిగినట్లయింది. సానుకూలం→ ఎగుమతి ఆధారిత రంగాలు → ఫార్మా→ ఐటీ సర్విసులు→ జౌళి→ ఉక్కు → రెమిటెన్సులు ప్రతికూలం → విదేశీ ప్రయాణాలు → విదేశీ చదువులు→ ధరల సెగ: ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులు, కార్లు, ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు మొదలైనవి → వ్యాపారాలు: కంపెనీలకు మార్జిన్ల ఒత్తిళ్లు. విస్తరణ ప్రణాళికలకు బ్రేక్. ఉద్యోగావకాశాలపై ప్రభావం, విదేశీ రుణాలు ప్రియం.– సాక్షి, బిజినెస్‌డెస్క్ -
ఐటీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. ఇక పదేళ్లూ అంతంతే!
ఐటీ రంగంలో పని చేసే ఉద్యోగులు ప్రస్తుతం గడ్డు పరిస్థతిని ఎదుర్కొంటున్నారు. రానున్న రోజుల్లో అయినా పరిస్థితులు మెరుగుపడతాయని ఆశా భావంతో ఉన్న ఉద్యోగులకు ఇప్పట్లో ఉపశమనం కనిపించేలా లేదు. జీతాల పెంపుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతూ వచ్చే పదేళ్లు జీతాల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుందని ఓ అధ్యయనం పేర్కొంటోంది. (రియల్మీ సి–55.. ఎంట్రీ లెవెల్ విభాగంలో సంచలనం!) ఆడిట్ అండ్ కన్సల్టింగ్ సంస్థ డెలాయిట్ అధ్యయనం ప్రకారం.. భారతీయ కంపెనీలలో జీతాల సగటు పెంపుదల 2022లో ఉన్న 9.4 శాతం నుంచి 2023లో 9.1 శాతానికి తగ్గుతుందని అంచనా. క్లయింట్ల ఖర్చుల కోతలను ఎదుర్కొంటున్న ఐటీ రంగం దశాబ్దంలో ఎన్నడూ లేనంత దారుణమైన పెంపుదలని చూడనుందని ఈ అధ్యయనం చెబుతోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో మాంద్యం ప్రభావంతో ఐటీ పరిశ్రమలో అట్రీషన్ (ఉద్యోగుల తొలగింపు) రేటు గత ఏడాది 19.7 శాతం ఉండగా రానున్న రోజుల్లో మరింత పడిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. (మోటరోలా జీ13 వచ్చేసింది.. ధర తక్కువే!) ఐటీ ప్రొడక్ట్ కంపెనీలు, డిజిటల్ ఇ-కామర్స్ కంపెనీల నేతృత్వంలో ఐటీ రంగం ఈ దశాబ్దంలో ఉద్యోగుల జీతాల్లో అత్యంత తక్కువ పెంపుదల ఉంటుందని అంచనా వేస్తున్నట్లు డెలాయిట్ ఇండియా భాగస్వామి ఆనందోరుప్ ఘోస్ తెలిపారు. మొండి ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్, మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థ ఈ సంవత్సరం ఐటీ కంపెనీలను మరింత పొదుపుగా ఉండేలా చేసే అవకాశం ఉంది. ఈ కారణాలను దృష్టిలో పెట్టుకుని 2023లో ఇంక్రిమెంట్లు, అట్రిషన్ పరిమాణాలు క్షీణిస్తాయని భావిస్తున్నామన్నారు. గత సంవత్సాల్లో విపరీతంగా నియామకాలు చేపట్టిన ఐటీ కంపెనీలు ప్రస్తుతం క్లయింట్ల దగ్గర నుంచి ఆశించిన మేర ప్రాజెక్టులు లేకపోవడంతో ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీనికితోడు ప్రస్తుతం తలెత్తిన బ్యాంకింగ్ సంక్షోభం మరింత కుంగదీస్తోంది. ఇప్పటికే అనేక ఎంఎన్సీ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. ఈ ప్రభావం భారతీయ టెక్ రంగంపై కూడా ఉంది. (మారుతీ సుజుకీ రికార్డ్.. విదేశాలకు 25 లక్షల కార్లు..) 25 రంగాల్లోని 300 కంపెనీల హెచ్ఆర్ హెడ్ల నుంచి డేటాను సేకరించి డెలాయిట్ ఈ అధ్యయనం చేపట్టింది. దీని ప్రకారం.. లైఫ్ సైన్సెస్, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాలు 2023లో అత్యధిక ఇంక్రిమెంట్లను చూస్తాయి. గత ఏడాది 9.7 శాతం ఉన్న వాస్తవిక పెంపుతో పోలిస్తే రెండు రంగల్లోనూ 9.5 శాతం పెంపుదల ఉంటుందని అంచనా. -
యూపీ, బిహార్‌లో ముగిసిన ఉప ఎన్నికలు
లక్నో/పట్నా: ఉత్తరప్రదేశ్, బిహార్లలో ఆదివారం జరిగిన ఉప ఎన్నికల్లో ఒక మోస్తరు నుంచి అత్యల్ప ఓటింగ్ నమోదయింది. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, ఫూల్పూర్ లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలో వరుసగా 43 శాతం, 37.39 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. కాగా, బిహార్‌లోని అరారియా లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో 57 శాతం పోలింగ్ నమోదైంది. అలాగే, భబువా, జహానాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో 54.03, 50.06 శాతం పోలింగ్ నమోదైందని బిహార్ చీఫ్ ఎలక్టోరల్ అధికారి అజయ్ వి.నాయక్ తెలిపారు. ఈ నెల 14వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. -
సివిల్స్ పోస్టులు గత అయిదేళ్లలో కనిష్టం
న్యూఢిల్లీ: అఖిల భారత సర్వీసుల్లో భర్తీ కోసం 980 ఖాళీలతో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) జారీ చేసిన నోటిఫికేషన్ సంఖ్యాపరంగా గత అయిదేళ్లలో అత్యల్పంగా నిలువనుంది. 2011లో కేవలం 880 ఖాళీల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. గతేడాది 1,079 ఖాళీలను, 2015లో 1,164 పోస్టులను భర్తీ చేసింది. 2013లో 1,228, 2014లో 1,364 పోస్టులను భర్తీ చేసింది. ఈ ఏడాది జూన్ 18న సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రిలిమ్స్–2017కు మార్చి 17 సాయంత్రం ఆరుగంటల వరకే దరఖాస్తులు స్వీకరిస్తామని యూపీఎస్సీ స్పష్టం చేసింది. మెయిన్స్ పరీక్ష అక్టోబర్‌లో నిర్వహించే అవకాశం ఉంది. -
అగళిలోనే అత్యల్పం
10.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అనంతపురం అగ్రికల్చర్: జిల్లా వ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నా... అగళి మండలంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం కూడా అగళిలో 10.1 డిగ్రీలు, మడకశిరలో 11.2 డిగ్రీలు, రొద్దం 11.3 డిగ్రీలు, తనకల్లు 11.7 డిగ్రీలు, అమరాపురం 12.7 డిగ్రీలు, గుడిబండ 12.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా మండలాల్లో 13 నుంచి 19 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే చలితీవ్రత మాత్రం కొనసాగుతోంది. -
బాల్య వివాహాలే అధికం...!
ప్రపంచ వ్యాప్తంగా అమ్మాయిల వివాహ వయసు అత్యల్పంగా ఉందని తాజా నివేదికలు చెప్తున్నాయి. ఒక్కో దేశంలో ఒక్కో విధంగా అమ్మాయిల పెళ్ళి వయసును నిర్ణయించినప్పటికీ... సగటున 18 ఏళ్ళ వయసుకు ముందుగానే ఆడపిల్లల పెళ్ళిళ్ళు జరుగుతున్నట్లు తాజా లెక్కలు చెప్తున్నాయి. ఐరోపాలోని అన్ని ప్రాంతాల్లో సగటున ఆడపిల్లల వివాహ వయసును స్పానిష్ ప్రభుత్వం 14 నుంచి 16 కు పెంచుతున్నట్లు ప్రకటించింది. అయితే ఎస్టోనియాలో అత్యల్ప వివాహ వయసు 15 ఏళ్ళుగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా వివాహానికి కనీస వయసు అబ్బాయిలకు 17, అమ్మాయిలకు 16 ఉండగా చాలా దేశాల్లో అంతకన్నా ముందే బాలికలకు వివాహాలు చేస్తున్నట్లు లెక్కలు చెప్తున్నాయి. యుఎస్ లోని మస్సచుసేట్స్ రాష్ట్రం సహా.. అనేక ప్రదేశాల్లో అమ్మాయిలకు న్యాయమూర్తుల సమ్మతితో 12 సంవత్సరాలకే అసాధారణ పరిస్థితుల్లో వివాహాలను చేస్తున్నారు. చాలా దేశాల్లో వివాహ వయసు 18 ఏళ్ళుగా నిర్ణయించినా.. అంతకు ముందుగానే పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. ముఖ్యంగా ఇండియాలో చాలామంది 13 ఏళ్ళ వయసున్న ఆడపిల్లలు వద్దు మొర్రో అంటున్నా... తల్లిదండ్రులు పెళ్ళిళ్ళు చేసేస్తున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2020 నాటికి ఏభై మిలియన్ల మంది 15 ఏళ్ళ లోపు బాలికలే వధువులుగా మారతారని అంచనా. లిబియా ఐసిస్ కుటుంబాల్లో ఆడపిల్లలకు రక్షణకోసం బలవంతంగా పన్నెండేళ్ళ వయసులోపే పెళ్ళిళ్లు చేసేస్తున్నారు. దీంతో వారు గర్భస్రావాలు, అనేక రకాలైన లైంగిక సంబంధ వ్యాధులకు గురౌతున్నారు. యూఎస్ స్టేట్ డిపార్ట్ మెంట్ కు చెందిన మానవ హక్కుల ప్రకారం. మిగతా దేశాల్లో అధికారిక వివాహ వయసు 18 ఉండగా...ముస్లింలు, హిందువుల్లో ప్రత్యేక వివాహ చట్టాలు కలిగి ఉన్నాయి. అయితే చైనాలో ప్రత్యేకంగా స్త్రీ, పురుషులు సుదీర్ఘకాలం వివాహం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. చైనా జనాభా నియంత్రణ విధానంలో భాగంగా 22 ఏళ్ళ వయసు వరకు అబ్బాయిలు, 20 ఏళ్ళ వరకూ అమ్మాయిలు పెళ్ళి చేసుకునేందుకు ఆగాల్సిందే. చట్టపరంగా మహిళలకు 18, పురుషులకు 21 ఏళ్ళు వివాహ వయసు నిర్ణయించిన భారతదేశం వంటి దేశాల్లో అంతకు ముందు చేసే చట్ట విరుద్ధమైన పెళ్ళిళ్ళను రద్దు చేసే అవకాశం ఉంది. కాగా 2013లో 20 నుంచి 24 ఏళ్ళ మధ్య వయసున్న పది మిలియన్ల మహిళలు 18 ఏళ్ళ వయసు లోపే పెళ్ళిళ్ళు చేసుకున్నట్లుగా ఫారిన్ రిలేషన్స్ సంయుక్త కౌన్సిల్ లెక్కలు చెప్తున్నాయి. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు 18 ఏళ్ళ వయసు రాకముందే పెళ్ళి చేసుకుంటున్నట్లు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఏది ఏమైనా.. ఇంకా జనన, వివాహ రిజిస్ట్రేషన్ వ్యవస్థలు అమలు కాని అనేక దేశాల్లో బాల్య వివాహాలనుంచి బాలికలను రక్షించలేని దురవస్థ కొనసాగుతూనే ఉంది. -
ఆరు సంవత్సరాల దిగువకు పుత్తడి
ముంబై: కొంతకాలంగా స్థిరంగా ఉన్న బంగారం విలువ దిగి వస్తోంది. అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్ లో డాలర్ డిమాండ్ పుంజుకోవడంతో బంగారం దాదాపు ఆరు సంవత్సరాల దిగువకు పడిపోయింది. అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు ఈ డిసెంబర్లో పెరగనున్నాయనే వార్తల నేపథ్యంలో 10గ్రాముల బంగారం ధర 25 వేలకు కొంచెం ఎగువన ట్రేడవుతోంది. దీంతో ఇన్వెస్టర్లలో ధరలు మరింత దిగి వస్తాయనే కొత్త ఆశలు చిగురించాయి. రాబోయే కాలంలో పసిడి ధర 25 వేలకు దిగి రావచ్చని ఆశిస్తున్నారు. పసిడితోపాటు ఇతర విలువైన మెటల్స్ రేట్లు కూడా దిగి వస్తున్నాయి. ముఖ్యంగా ప్లాటినం, వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. బులియన్ మార్కెట్లో గత 10, 15 సెషన్లుగా క్షీణిస్తూ వస్తున్న పసిడి ధర బుధవారం 25 వేల మార్కు దగ్గర ట్రేడవుతోంది. ఈ క్షీణత కొనసాగితే , పుత్తడి ధర ఇంకా దిగి వచ్చే అవకాశాలున్నాయని ఎనలిస్టులు సూచిస్తున్నారు. 2010 ఫిబ్రవరితో పోలిస్తే ..బంగారం విలువ బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాములు రూ. 25,117 స్థాయిని తాకింది. మంగళవారం 450 రూపాయల పతనమైన బంగారం విలువ ఈ రోజు కూడా కొనసాగి మరింత నేలచూపులు చూస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రిటైల్ మార్కెట్ లో ఆర్నమెంట్ బంగారం, నగలకు డిమాండ్ తగ్గుముఖం పట్టడం కూడా ఒక కారణమని ఎనలిస్టులు భావిస్తున్నారు. గత కొన్ని రోజులు పసిడి ధరలో క్షీణత గమనిస్తున్నప్పటికీ, ఈ పతనం కీలకమైందంటున్నారు ట్రేడ పండితులు. అటు ఫెడ్ అంచనాలు, పారిస్ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిసాయి. నిఫ్టీ 100, సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా నష్టపోయాయి.