బాల్య వివాహాలే అధికం...!
ప్రపంచ వ్యాప్తంగా అమ్మాయిల వివాహ వయసు అత్యల్పంగా ఉందని తాజా నివేదికలు చెప్తున్నాయి. ఒక్కో దేశంలో ఒక్కో విధంగా అమ్మాయిల పెళ్ళి వయసును నిర్ణయించినప్పటికీ... సగటున 18 ఏళ్ళ వయసుకు ముందుగానే ఆడపిల్లల పెళ్ళిళ్ళు జరుగుతున్నట్లు తాజా లెక్కలు చెప్తున్నాయి. ఐరోపాలోని అన్ని ప్రాంతాల్లో సగటున ఆడపిల్లల వివాహ వయసును స్పానిష్ ప్రభుత్వం 14 నుంచి 16 కు పెంచుతున్నట్లు ప్రకటించింది. అయితే ఎస్టోనియాలో అత్యల్ప వివాహ వయసు 15 ఏళ్ళుగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా వివాహానికి కనీస వయసు అబ్బాయిలకు 17, అమ్మాయిలకు 16 ఉండగా చాలా దేశాల్లో అంతకన్నా ముందే బాలికలకు వివాహాలు చేస్తున్నట్లు లెక్కలు చెప్తున్నాయి.
యుఎస్ లోని మస్సచుసేట్స్ రాష్ట్రం సహా.. అనేక ప్రదేశాల్లో అమ్మాయిలకు న్యాయమూర్తుల సమ్మతితో 12 సంవత్సరాలకే అసాధారణ పరిస్థితుల్లో వివాహాలను చేస్తున్నారు. చాలా దేశాల్లో వివాహ వయసు 18 ఏళ్ళుగా నిర్ణయించినా.. అంతకు ముందుగానే పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. ముఖ్యంగా ఇండియాలో చాలామంది 13 ఏళ్ళ వయసున్న ఆడపిల్లలు వద్దు మొర్రో అంటున్నా... తల్లిదండ్రులు పెళ్ళిళ్ళు చేసేస్తున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2020 నాటికి ఏభై మిలియన్ల మంది 15 ఏళ్ళ లోపు బాలికలే వధువులుగా మారతారని అంచనా. లిబియా ఐసిస్ కుటుంబాల్లో ఆడపిల్లలకు రక్షణకోసం బలవంతంగా పన్నెండేళ్ళ వయసులోపే పెళ్ళిళ్లు చేసేస్తున్నారు. దీంతో వారు గర్భస్రావాలు, అనేక రకాలైన లైంగిక సంబంధ వ్యాధులకు గురౌతున్నారు. యూఎస్ స్టేట్ డిపార్ట్ మెంట్ కు చెందిన మానవ హక్కుల ప్రకారం. మిగతా దేశాల్లో అధికారిక వివాహ వయసు 18 ఉండగా...ముస్లింలు, హిందువుల్లో ప్రత్యేక వివాహ చట్టాలు కలిగి ఉన్నాయి.
అయితే చైనాలో ప్రత్యేకంగా స్త్రీ, పురుషులు సుదీర్ఘకాలం వివాహం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. చైనా జనాభా నియంత్రణ విధానంలో భాగంగా 22 ఏళ్ళ వయసు వరకు అబ్బాయిలు, 20 ఏళ్ళ వరకూ అమ్మాయిలు పెళ్ళి చేసుకునేందుకు ఆగాల్సిందే. చట్టపరంగా మహిళలకు 18, పురుషులకు 21 ఏళ్ళు వివాహ వయసు నిర్ణయించిన భారతదేశం వంటి దేశాల్లో అంతకు ముందు చేసే చట్ట విరుద్ధమైన పెళ్ళిళ్ళను రద్దు చేసే అవకాశం ఉంది. కాగా 2013లో 20 నుంచి 24 ఏళ్ళ మధ్య వయసున్న పది మిలియన్ల మహిళలు 18 ఏళ్ళ వయసు లోపే పెళ్ళిళ్ళు చేసుకున్నట్లుగా ఫారిన్ రిలేషన్స్ సంయుక్త కౌన్సిల్ లెక్కలు చెప్తున్నాయి. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు 18 ఏళ్ళ వయసు రాకముందే పెళ్ళి చేసుకుంటున్నట్లు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఏది ఏమైనా.. ఇంకా జనన, వివాహ రిజిస్ట్రేషన్ వ్యవస్థలు అమలు కాని అనేక దేశాల్లో బాల్య వివాహాలనుంచి బాలికలను రక్షించలేని దురవస్థ కొనసాగుతూనే ఉంది.