ధర్మశాల: దేశంలో క్షయ వ్యాధిని నిర్మూలించేందుకు బృహత్ ప్రణాళికను కేంద్రం రూపొందిస్తోందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. 2025 నాటికి ఈ భయంకరమైన వ్యాధిని తరిమికొట్టాలన్న లక్ష్యంతో కేంద్రం ఉందని, ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రణాళికపై కేంద్రం పునఃపరిశీలన చేస్తోందని చెప్పారు. ఈ మేరకు శనివారం ఇక్కడ జరిగిన ‘క్షయ రహిత భారతదేశం’ సదస్సులో ఆయన తెలిపారు.
క్షయ సమస్యను అధిగమించేందుకు జాతీయ ప్రణాళికతో రాబోతున్నామని, ప్రస్తుతం దాన్ని పునఃపరిశీలిస్తున్నామని చెప్పారు. ఈ ప్రణాళిక రూపొందించే ప్రక్రియ కొనసాగుతోందని, వచ్చే నెలలో దీనిపై సమీక్ష నిర్వహించనున్నామని చెప్పారు.
'క్షయ నిర్మూలనకు బృహత్ ప్రణాళిక'
Published Sun, Apr 9 2017 6:56 PM | Last Updated on Tue, Sep 5 2017 8:22 AM
Advertisement
Advertisement