న్యూఢిల్లీ: ఉపాధి హామీ పథకంలో కూలీలకు ఇచ్చే దినసరి వేతనాల పెంపుదల చాలా తక్కువగా ఉండటంపై కేంద్రం దృష్టిసారించింది. లబ్ధిదారులకు ఇచ్చే కనీస వేతనం ఎంత ఉండాలన్న దానిపై కసరత్తు చేస్తోంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సమాచారం ప్రకారం ఉపాధి కూలీ పెంపు బిహార్, అస్సాం, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లలో కేవలం ఒక్క రూపాయి ఉండగా, ఒడిశాలో రూ.2, పశ్చిమబెంగాల్లో రూ.4 ఉంది.. అత్యధికంగా కేరళ, హర్యానాలో రూ. 18 పెంచారు.
ఉపాధి వేతనం పెంపు గత ఏడాది 5.7 శాతం ఉండగా, ఈసారి అది కేవలం 2.7 శాతమే ఉంది. కేంద్రం నోటిఫై చేసిన వేతనాలకు, ఆయా రాష్ట్రాల్లో ఉండే కనీస వేతనాలకు చాలా వ్యత్యాసం ఉందని, ఇది కొన్ని చోట్ల రాష్ట్రాల కనీస వేతనాల కంటే తక్కువగా ఉందని సంబంధిత వర్గాలు చెప్పాయి. ఈ అంతరాన్ని తొలగించి కనీస వేతనాన్ని నిర్ణయించేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి నాగేశ్ సింగ్ నేతృత్వంలో కమిటీని నియమించింది. దేశంలో ఉపాధి కూలీలకు అత్యధిక వేతనం హర్యానాలో రూ.277 ఉండగా, అత్యల్పంగా బిహార్‌లో రూ.168 ఉంది.
ఉపాధి కూలీల కనీస వేతనంపై కమిటీ
Published Mon, May 8 2017 9:02 AM | Last Updated on Tue, Sep 5 2017 10:42 AM
Advertisement
Advertisement