MGNREGA wages
-
ఉపాధి కూలీ అవతారమెత్తిన IRS అధికారి
-
కొత్త నిబంధనలు.. మీ ‘ఉపాధి’ జాబ్‌కార్డుతో ఆధార్ లింక్ అయి ఉందా?
హుజూర్నగర్ (సూర్యాపేట): జాతీయ ఉపాధిహామీ పథకంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కూలీ హాజరు నమోదు కోసం నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (ఎన్ఎంఎంఎస్)ను అమలులోకి తెచ్చిన కేంద్రం తాజాగా కూలిల చెల్లింపుల్లోనూ కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. ఉపాధి కూలీల జాబ్‌కార్డును వారి ఆధార్‌తో అనుసంధానం చేస్తోంది. దీంతో బోగస్ కూలీలకు చెక్ పడడమే కాకుండా కేంద్రం విడుదల చేసే నిధులు నేరుగా కూలీల ఖాతాలో జమకానున్నాయి. అయితే ఆధార్ సీడింగ్‌లో జిల్లా మెరుగైన స్థానంలో ఉన్నా జాబ్ కార్డు, ఆధార్ వివరాలు సరిపోలకపోవడం సమస్యాత్మకంగా మారుతోంది. ఆధార్ అథెంటికేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా వేలాది దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. దీంతో కూలీలు ఉపాధికి దూరమయ్యే అవకాశం ఉంది. చెల్లింపుల్లో పూర్తి పారదర్శకత ఉపాధి హామీ కూలీలకు ప్రస్తుతం బ్యాంక్, పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా కూలి డబ్బులు చెల్లిస్తోంది. అయితే కొందరికి రెండేసి చొప్పున జాబ్‌కార్డులు ఉండడంతో పాటు, మరికొంత మంది పనులకు హాజరు కాకున్నా కూలి పొందుతున్నారు. రాజకీయ పలుకుబడి, నాయకుల అండదండలలతో పనులకు హాజరువుతున్నట్లుగా పేర్లు నమోదు చేసుకుని డబ్బులు స్వాహా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిని గుర్తించిన కేంద్రం కూలి చెల్లింపుల్లో పూర్తి పారదర్శకత తీసుకురావాలని సంకల్పించింది. కూలి చెల్లింపుల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా ఆధార్ బేస్డ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే కూలీల జాబ్ కార్డుకు ఆధార్‌ను అనుసంధానం చేస్తోంది. దీంతో ఇకపై ఆధార్ లింకైన బ్యాంక్, పోస్టల్ బ్యాంక్ ఖాతాల్లో మాత్రమే కూలి డబ్బులు జమ కానున్నాయి. పబ్లిక్ ఫండ్ మేనేజ్మెంట్ సిస్టం (పీఎఫ్ఎంఎస్) ద్వారా డబ్బులు ఎటు వెళ్తున్నాయనేది కేంద్రం నేరుగా పర్యవేక్షించే వెసులుబాటు కలగనుంది. జిల్లాలో 6,31,156 మంది ఉపాధి కూలీలు.. జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద 2,71,992 జాబ్ కార్డులు ఉండగా వాటిలో 6,31,156 మంది కూలీలు నమోదై ఉన్నారు. వారిలో పనికి వచ్చే వారు 3,72,666 మంది ఉన్నారు. ముమ్మరంగా సాగుతున్న ప్రక్రియ జాబ్ కార్డుకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ జిల్లాలో ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటి వరకు 96.83 శాతం జాబ్‌కార్డులకు ఆధార్‌ను లింక్ చేశారు. అయితే రెండింటి (ఆధార్‌కార్డు, జాబ్‌కార్డు)లో కూలీల పేర్లు, చిరునామా వంటి వివరాలు సరిపోలకపోవడంతో భారీ సంఖ్యలో కార్డులు తిరస్కరణకు గురయ్యాయి. ఇప్పటి వరకు 3,18,832 కార్డులు తిరస్కరణకు గురికావడంతో అప్రూవల్ కోసం పెండింగ్‌లో ఉంచారు. వాటిని మళ్లీ అథెంటికేషన్ కోసం పంపనున్నారు. దీంతో మరికొన్ని సవరణలతో కొన్ని కార్డులు అమలులోకి రానున్నాయి. ప్రస్తుతం 29,770 మందికి ఆధార్ బేస్డ్ పేమెంట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆధార్‌ను బట్టి జాబ్‌కార్డును మారుస్తాం జాబ్ కార్డులో ఉన్న వివరాలకు ఆధార్ కార్డులో ఉన్న వివరాలు సరిపోలకపోవడంతోనే కొన్ని కార్డులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని మళ్లీ అథెంటికేషన్‌కు పంపనున్నారు. కార్డులో ఉన్న వాటి వివరాలు 40 శాతం వరకు సరిపోలితే వాటిని పరిగణలోకి తీసుకుంటారు. లేదంటే ఆధార్‌కార్డు వివరాలను బట్టి జాబ్ కార్డును సవరణ చేసి వినియోగంలోకి తెస్తాం. – డాక్టర్ పెంటయ్య, డీఆర్డీఓ, సూర్యాపేట -
మోదీకి బెంగాల్ సీఎం మమత లేఖ
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీజేపీ మధ్య పచ్చగడి వేస్తే భగ్గుమనేంతగా పరిస్థితులు మారిపోయాయి. ఇప్పటికే వీరి మధ్య మాటల తూటలు, భౌతిక దాడులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీకి మమతా బెనర్జీ ఓ లేఖ రాశారు. ఆ లేఖలో గ్రామీణ ఉపాధి హామీ పథకం, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాల కింద పశ్చిమ బెంగాల్‌కు ఎందుకు నిధులు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. బెంగాల్ కూలీలకు 100 రోజుల పనికి వేతనాలను తర్వగా విడుదల చేసేలా ఆయా సంబంధిత మంత్రిత్వశాఖలను ఆదేశించాలని ప్రధాని మోదీని ఆమె కోరారు. కేంద్రం నిధులు విడుదల చేయకపోవడంతో బెంగాల్ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మమత ఆవేదన వ్యక్తపరిచారు. మరోవైపు.. పీఎం ఆవాస్ యోజన నిధుల విషయంపై కూడా మోదీని మమత నిలదీశారు. ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రం నిధులు ఇవ్వకపోవడంతో గ్రామీణాభివృద్ధి జరగడంలేదని ఆరోపించారు. ఇప్పటికైనా వీటికి సంబంధించిన నిధులను కేంద్రం వెంటనే విడుదల చేయాలని మమత కోరారు. -
రాష్ట్రంలోనే ‘ఉపాధి’ అధికం, కేంద్రం ప్రశంసల వర్షం
అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం గ్రామంలో పసల వెంకటేసులు కుటుంబం ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇప్పటివరకు ఉపాధిహామీ పథకంలో పనులు చేసింది. ఈ 4 నెలల్లో రూ.24,504 సంపాదించుకుంది. ఇదే కాలంలో ఆ గ్రామంలో మొత్తం 1,341 కుటుంబాలకు ప్రభుత్వం పనులు కల్పించింది. ఆ ఒక్క గ్రామంలోనే కూలీలు రూ.2.41 కోట్లను వేతనాల రూపంలో పొందారు. సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కువమంది గ్రామీణ పేదలకు ప్రభుత్వపరంగా పనులు కల్పిస్తున్నది మన రాష్ట్రంలోనే. దేశంలోనే ఉపాధిహామీ పథకం కింద ఎక్కువమందికి పనికల్పించడంలో ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ విషయాన్ని ఇటీవల లోక్‌సభలో ఒక ప్రశ్నకు జవాబుగా కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి జూలై నెలాఖరు వరకు 4 నెలల కాలంలో ఉపాధిహామీ పథకం ద్వారా మన రాష్ట్రంలో 71.90 లక్షల మందికి ప్రభుత్వం పనులు కల్పించినట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తర్వాత మధ్యప్రదేశ్‌లో 65.53 లక్షల మందికి అక్కడి ప్రభుత్వం పనులు కల్పించింది. కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి మొత్తం 34 రాష్ట్రాలు ఉండగా.. అందులో ఆంధ్రప్రదేశ్ సహా 6 రాష్ట్రాలు మాత్రమే ఈ 4 నెలల కాలంలో వారి రాష్ట్రాల్లో 50 లక్షల మంది కన్నా ఎక్కువమంది పేదలకు పనులు కల్పించినట్టు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ పేర్కొంది. రాష్ట్రంలో 1.03 కోట్ల మంది ఉపాధి హామీ పథకంలో కూలీలుగా తమ పేర్లు నమోదు చేసుకుంటే, అందులో 70 శాతం మందికి పైగా ప్రభుత్వం ఈ కరోనా విపత్తు కాలంలో పనులు కల్పించడం గమనార్హం. రోజుకు సరాసరి కూలి రూ.221 రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం పనులకు హాజరైన కూలీలకు ఈ 4 నెలల్లోనే రూ.4,485 కోట్లను వేతనాల రూపంలో చెల్లించినట్టు రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు తెలిపారు. ఒకరోజు పనిచేసినందుకు ఒక్కొక్క కూలీకి సరాసరిన రూ.221 వంతున గిట్టుబాటు అయినట్టు చెప్పారు. -
కూలీలను ఆదుకునేందుకు ప్రభుత్వ ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత కూలీలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను ప్రకటించింది. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా అమలవుతున్న లాక్డౌన్ వల్ల పనులు లేక అల్లాడుతున్న పేదల ఆర్థిక కష్టాలకు చెక్ పెట్టే దిశగా ప్రభుత్వం దృష్టి సారించింది. ఉపాధి హామీ కింద వ్యక్తిగత పనులకు ప్రాధాన్యత ఇస్తూ, వేతనాల ద్వారా కూలీలకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రధానంగా ఉద్యాన పంటలు, మల్బరీ తోటల పెంపకం, పశు గ్రాస పెంపకం వంటి వాటికి ప్రాధాన్యతనివ్వగా, దీనితో పాటు కాలువలు, చెరువుల తవ్వకం వంటి ఇతర సామాజిక పనులను స్థానిక డిమాండ్ ఆధారంగా చేపట్టాలని అధికారులు నిర్ధేశించారు. అయితే పనులు చేసే కూలీలు ఖచ్చితంగా భౌతిక దూరంతో పాటు కరోనా వ్యాప్తి నిరోధక నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం మార్గదర్శకాలను ప్రకటించింది. ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం ప్రకటించిన నిబంధనలకు అనుగుణంగా ఉపాధి హామీ కూలీలు నడిచి వెళ్ళే దూరంలోనే సాధ్యమైనంత వరకు పనులు కల్పించనున్నారు. ఉపాధి హామీ కూలీలకు చెల్లించటానికి నిధులకు ఎలాంటి కొరత లేనందున గ్రామాల్లో పనులు కల్పించడం, గ్రామీణ పేదలకు ఆర్థిక చేయూతను అందించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జిల్లా కల్లెక్టర్లను, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్లను ఆదేశించింది. (ఆర్థిక ఇబ్బందుల్లోనూ 'సున్నా వడ్డీ') ఉపాధిహామీ కూలీలకు అదనంగా 30 శాతం వేసవిభత్యం రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలకు నరేగా నిబంధనల ప్రకారం చెల్లిస్తున్న కూలితో పాటు అదనంగా వేసవి భత్యం అందచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతల మధ్య ఉపాధి హామీ కూలీలు గరిష్ట కూలీని పొందే స్థాయిలో పనులు చేయలేని పరిస్థితి వుంటుంది. దానిని దృష్టిలో పెట్టుకుని వారు చేసిన కూలీకి అదనంగా ముప్పై శాతం వరకు వేసవి భత్యంను పొందేందుకు వీలు కల్పించారు. దీనివల్ల ఉపాధి హామీ కూలీలు గరిష్టంగా రోజుకు 237 రూపాయల వరకు కూలిగా పొందేందుకు అవకాశం వుంది. రోజువారీ వారు చేసిన పనిని లెక్కించి అందుకు అనుగుణంగా కూలీ చెల్లిస్తారు. ఈ ఏడాది రాష్ట్రానికి అదనంగా కోటి పనిదినాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలోని ఉపాధి హామీ కూలీలకు అదనంగా కోటి పనిదినాలు లభించాయి. గత ఆర్థిక సంవత్సరంలో 20 కోట్ల పనిదినాలు మాత్రమే రాష్ట్రానికి కేటాయించగా, ఈ ఏడాది అదనంగా మరో కోటి పనిదినాలను కేటాయించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సుముఖత వ్యక్తం చేసింది. రాష్ట్రానికి చెందిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారుల ముందుచూపుతో తీసుకున్న చర్యల ఫలితంగా రాష్ట్రంలోని కూలీలకు ఈ అదనపు ప్రయోజనం లభించింది. గత ఆర్థిక సంవత్సరంలో వేతన దారులకు రూ. 20.08 కోట్ల పనిదినాలు కల్పించి రూ 4084.86 కోట్లు వేతన రూపంలో చెల్లించారు. ఉపాధి హామీ పథకం కింద గత ఆర్థిక సంవత్సరంలో మెటీరియల్ రూపంలో రూ.2624.18 లు, వేతన రూపంలో రూ.4084.86 కోట్లు కలిపి మొత్తం రూ.6709.04 లు వ్యయం చేశారు. ఉపాధి హామీ నిధులకు కొరత లేదు: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కరోనా కారణంగా దినసరి కూలీలు పనులు లేక అల్లాడుతున్న తరుణంలో వారిని ఆదుకునేందుకు ఉపాధి హామీ పనులను ప్రభుత్వం ముందుకు తీసుకువస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఉపాధి హామీ కూలీలకు చెల్లించేందుకు నిధుల కొరత లేదని వెల్లడించారు. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం ద్వారా చెల్లించే వేతనాల కోసం 2020-21 ఆర్ధిక సంవత్సరంకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా రూ.2149.78 కోట్లు మంజూరు చేసిందని అన్నారు. ఉపాధి హామీ కోసం ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరంలో ఈనెల 15వ తేదీ వరకు ప్రభుత్వం ఉపాధి కూలీలకు వేతనాల రూపంలో రూ. 494.3 కోట్లు చెల్లించగా జూన్ వరకూ చెల్లించటానికి మరో రూ.1688.97 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. 2019-2020 లో రూ. 211 గా ఉన్న దినసరి వేతనాన్ని 2020-21 లో అదనంగా రూ.26లు పెంచి రోజుకి రూ. 237 లు చొప్పున చెల్లించటం జరుగుతుందన్నారు. తద్వారా గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం రూ. 546 కోట్లు అదనంగా రాష్ట్రంలోని ఉపాధి హామీ కూలీలకు వేతన రూపంలో అందుతుందని తెలిపారు. -
ఉపాధి సరే.. వేతనాలేవీ..?
సాక్షి,మద్దికెర: వ్యవసాయ కూలీలు వలసలు పోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో పనులు చేసినా వేతనాలకు అందకపోవడంతో వలసలు తప్పడం లేదు. నాలుగు నెలలుగా చేసి న పనులకు వేతనాలు దాదాపు రూ.1.50 కోట్లు ఇంత వరకు ఇవ్వకపోవడంతో కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో దాదాపు 10 వేల జాబ్ కార్డులున్నాయి. ఈ ఏడాది వ్యవసాయ పనులు ముగిసిన గ్రామాల్లో దాదాపు వెయ్యి మంది ఉపాధి కూలీలు పనులకు వెళ్తున్నారు. ఉపాధి కల్పించి సకాలంలో వేతనాలు చెల్లిస్తామని అధికారులు గ్రామాల్లో సభలు ఏర్పాటు చేసి కూలీలకు తెల్పడంతో వారు పనులకు వెళ్లారు. అయితే పనులు చేసినా వేతనాలు ఇవ్వడంలో ఆలస్యం అవుతున్నందు వల్ల్ల వారు ఉపాధి పనులకు వెళ్లడానికి ఇష్టపడడం లేదు. ఇలా అయితే ఎవరి కోసం ఉపాధి పనులు కల్పించినట్లు అని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమ వేతనాలు చెల్లించాలని కోరుతున్నారు. నాలుగు నెలల గడిచినా కూలి ఇవ్వలేదు.. ఉపాధి పనులు చేసి నాలుగు నెలలు గడిచినా.. ఇంత వరకు వేతనాలు ఇవ్వలేదు. ఇలా అయితే పనులకు ఎలా వెళ్లేది.మా జీవనం ఎలా సాగుతుంది. అధికారులు స్పందించి సకాలంలో వేతనాలు ఇస్తే.. గ్రామాల్లో వలసలు కూడా తగ్గుతాయి. – తిమ్మయ్య, పెరవలి వేతనాలు మంజూరు చేస్తాం... నాలుగు నెలలు వేతనాలు రావాల్సి ఉంది. కూలీలకు వేతనాలు మంజూరు విషయాన్ని జిల్లా అధికారులకు తెలియజేసి సకాలంలో వేతనాలు అందించేందుకు కృషి చేస్తాం. వేతనాలు మంజూరులో ఆలస్యమైన మాట వాస్తవమే.. పనులు చేసిన వారందరికీ వేతనాలు వచ్చేలా చర్యలు తీసుకుంటాం. – రామకృష్ణ, ఏపీఓ -
ఉపాధి కూలీల కనీస వేతనంపై కమిటీ
న్యూఢిల్లీ: ఉపాధి హామీ పథకంలో కూలీలకు ఇచ్చే దినసరి వేతనాల పెంపుదల చాలా తక్కువగా ఉండటంపై కేంద్రం దృష్టిసారించింది. లబ్ధిదారులకు ఇచ్చే కనీస వేతనం ఎంత ఉండాలన్న దానిపై కసరత్తు చేస్తోంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సమాచారం ప్రకారం ఉపాధి కూలీ పెంపు బిహార్, అస్సాం, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లలో కేవలం ఒక్క రూపాయి ఉండగా, ఒడిశాలో రూ.2, పశ్చిమబెంగాల్లో రూ.4 ఉంది.. అత్యధికంగా కేరళ, హర్యానాలో రూ. 18 పెంచారు. ఉపాధి వేతనం పెంపు గత ఏడాది 5.7 శాతం ఉండగా, ఈసారి అది కేవలం 2.7 శాతమే ఉంది. కేంద్రం నోటిఫై చేసిన వేతనాలకు, ఆయా రాష్ట్రాల్లో ఉండే కనీస వేతనాలకు చాలా వ్యత్యాసం ఉందని, ఇది కొన్ని చోట్ల రాష్ట్రాల కనీస వేతనాల కంటే తక్కువగా ఉందని సంబంధిత వర్గాలు చెప్పాయి. ఈ అంతరాన్ని తొలగించి కనీస వేతనాన్ని నిర్ణయించేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి నాగేశ్ సింగ్ నేతృత్వంలో కమిటీని నియమించింది. దేశంలో ఉపాధి కూలీలకు అత్యధిక వేతనం హర్యానాలో రూ.277 ఉండగా, అత్యల్పంగా బిహార్‌లో రూ.168 ఉంది.