![Bengal CM Mamata Banerjee Writes To PM Modi - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/12/mamatha.jpg.webp?itok=9mL9SReE)
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీజేపీ మధ్య పచ్చగడి వేస్తే భగ్గుమనేంతగా పరిస్థితులు మారిపోయాయి. ఇప్పటికే వీరి మధ్య మాటల తూటలు, భౌతిక దాడులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీకి మమతా బెనర్జీ ఓ లేఖ రాశారు.
ఆ లేఖలో గ్రామీణ ఉపాధి హామీ పథకం, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాల కింద పశ్చిమ బెంగాల్‌కు ఎందుకు నిధులు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. బెంగాల్ కూలీలకు 100 రోజుల పనికి వేతనాలను తర్వగా విడుదల చేసేలా ఆయా సంబంధిత మంత్రిత్వశాఖలను ఆదేశించాలని ప్రధాని మోదీని ఆమె కోరారు. కేంద్రం నిధులు విడుదల చేయకపోవడంతో బెంగాల్ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మమత ఆవేదన వ్యక్తపరిచారు.
మరోవైపు.. పీఎం ఆవాస్ యోజన నిధుల విషయంపై కూడా మోదీని మమత నిలదీశారు. ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రం నిధులు ఇవ్వకపోవడంతో గ్రామీణాభివృద్ధి జరగడంలేదని ఆరోపించారు. ఇప్పటికైనా వీటికి సంబంధించిన నిధులను కేంద్రం వెంటనే విడుదల చేయాలని మమత కోరారు.
Comments
Please login to add a commentAdd a comment