వాషింగ్టన్: అరుణ గ్రహంపై ఒకప్పుడు భారీ నీటి సరస్సు ఉండేదని అమెరికాకు చెందిన అరిజోనా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంగారకుడిపై 160 కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉన్న ‘లేక్ గుసేవ్’ అనే బిలం ఆ సరస్సుకు చెం దినదేనని గుర్తించినట్లు వారు పేర్కొన్నారు.
నాసా పంపిన స్పిరిట్ రోవర్ సహాయంతో ఈ బిలాన్ని పరిశీలించారు. ఆ బిలానికి అనుసంధానమై ఉన్న లోయల ద్వారా వరద ప్రవహించి లేక్ గుసేవ్‌ను చేరేదని... అది ఆవిరైపోయినప్పుడు మిగిలిన అవక్షేపాలను తాము గుర్తించామని పరిశోధనకు నేతృత్వం వహించిన స్టీవ్ఫ్ ్రచెప్పారు. ఈ బిలం పక్కనే ఉన్న కొ లంబియా కొండల్లో పురాతన రాళ్లను, బిలం దక్షిణ రిమ్‌లోని కార్బొనేట్ అవక్షేపాలను బట్టి ఒకప్పుడు సరస్సు ఉండేదని భావిస్తున్నట్లు తెలిపారు.
అంగారకుడిపై నీటి సరస్సు!
Published Fri, Apr 11 2014 12:41 AM | Last Updated on Sat, Sep 2 2017 5:51 AM
Advertisement