washing ton
-
13 ఏళ్లకే ‘అత్యంత మేధావి’గా.. తెలంగాణ కొత్తగూడెం మిస్ టీన్!
ఖమ్మం/కొత్తగూడెం: అమెరికాలోని వాషింగ్టన్లో ఉన్న సియాటల్ నగరంలో ఈనెల 16న ‘సామాజిక విద్యాపరమైన సమతుల్యత’ అంశంపై జరిగిన ఈవెంట్లో కొత్తగూడేనికి చెందిన పదమూడేళ్ల బాలిక అవ్యుక్త గెల్లా ప్రతిభ కనబరిచి అత్యంత మేధావి అవార్డుకు ఎంపికైంది. అమెరికాలో ఉంటున్న గెల్లా గణేష్ – రాధిక కుమార్తె అవ్యుక్తతో పాటు 13 ఏళ్ల నుండి 40 ఏళ్ల లోపు వయస్సు కలిగిన 30 మంది ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిస్ టీన్ విభాగంలో అవ్యుక్త పలు అంశాలపై తన ప్రసంగంతో ఆకట్టుకోగా అవార్డుకు ఎంపిక చేశారు. ఈమేరకు ఆమె తాతయ్య, అమ్మమ్మ అయిన కొత్తగూడేనికి చెందిన వసుంధర వస్త్ర దుకాణం యజమానులు తాటిపల్లి శంకర్‌బాబు – రాజేశ్వరి తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ఇవి చదవండి: ఔను..! నిజంగానే కలెక్టర్‌కు కోపమొచ్చింది! -
బాణా సంచాతో బుగ్గనకు స్వాగతం పలికిన వైయస్ అభిమానులు
-
దారుణం : కన్నబిడ్డనే చంపి నదిలో పడేశారు
వాషింగ్టన్: పిల్లలు లేరని కొన్ని జంటలు తల్లడిల్లుతుంటే, ఈ జంట మాత్రం తమ ముద్దులొలికే తమసొంత బిడ్డనే నిర్దాక్షిణ్యంగా పొట్టనబెట్టుకున్నారు. ఆ తరువాత ఏమీ ఎరగనట్టుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ దీనిపై కూపీ లాగిన పోలీసులు అసలు విషయాన్ని రాబట్టారు. దీంతో వీరి బండారం బైటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అమెరికాలోని మిడిల్ టౌన్‌కు చెందిన బ్రిటానీ గోస్ని, జెమ్స్ హామిల్టన్ భార్యభర్తలు. వీరికి జెమ్స్ హట్చింగ్సన్ అనే 6 ఏళ్ళ కొడుకు ఉన్నాడు. వీరు గత ఆదివారం ఉదయం మిడిల్ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళి తమ కుమారుడు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. వారు చెప్పిన ఆనవాళ్లను ఆధారంగా పోలీసులు బాలుడి కోసం వెతుకులాట ప్రారంభించారు. ఈ క్రమంలో తల్లిదండ్రుల ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు జెమ్స్, హమిల్టన్లను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు సంగతి వెలుగు చూసింది. కుమారుడిని తామే హత్యచేసినట్లు తల్లిదండ్రులు నేరం అంగీకరికరించారు. బాలుడిని చంపి ఓహియో నదిలో పడేశామని తెలిపారు. దీంతో బాలుడి హత్య, కేసును తప్పుదోవ పట్టించడం వంటి పలు అభియోగాల కింద కేసు నమోదు చేసిన పోలీసులు వాళ్లిద్దరినీ అరెస్ట్ చేశారు. కన్నకొడుకును పొట్టన పెట్టుకున్న తల్లి గోస్నిలో ఏ మాత్రం పశ్చాత్తాపం లేకపోగా తండ్రి జెమ్స్ హామిల్టన్ మాత్రం తన చర్యపట్ల తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు బాలుడి శవం కోసం పోలీసులు ఓహియో నదిలో గాలింపు చేపట్టారు. నీటి ప్రవాహం అధికంగా ఉండటం వలన మృతదేహాన్ని వెతకడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని మిడిల్‌టౌన్ పోలీస్ డేవిడ్ బిర్క్ తెలిపారు. దీనిపై కన్నబిడ్డనే అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారంటూ స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతని చిరునవ్వును మాత్రం ఎప్పటికి మరవలేమంటూ సంతాపం ప్రకటించారు. చదవండి: వైరల్: తనను తానే పెళ్లి చేసుకున్న యువతి -
బైడెన్‌కు అండగా భారతీయ డాక్టర్
సాక్షి,వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ దేశంలో కరోనా వైరస్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన నిపుణుల బృందానికి నేతృత్వం వహించే అవకాశం భారతీయ అమెరికన్ డాక్టర్‌కు లభించింది. ఈ ‘కోవిడ్–19 టాస్క్ ఫోర్స్’కు నియమించిన ముగ్గురు అధ్యక్షుల్లో భారతీయ అమెరికన్ వైద్యుడు డాక్టర్ వివేక్ మూర్తి ఒకరు. డాక్టర్ డేవిడ్ కెస్లర్, డాక్టర్ మార్సెల్లా నునెజ్ స్మిత్ కూడా ఈ టాస్క్‌ఫోర్స్‌కు నేతృత్వం వహిస్తారు. కరోనాను కట్టడి చేసే సమగ్ర కార్యాచరణను ఈ టాస్క్ ఫోర్స్ బైడెన్‌కు అందిస్తుంది. కరోనాను కట్టడి చేసేందుకు ప్రత్యేకంగా నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు బైడెన్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సలహా బృందంలో భారతీయ అమెరికన్ అతుల్ గావండే, లూసియానా బోరియొ, రిక్ బ్రైట్ ఉన్నారు. డాక్టర్ వివేక్ మూర్తి 2014 నుంచి 2017 వరకు అమెరికా 19వ సర్జన్ జనరల్‌గా సమర్ధవంతంగా విధులు నిర్వర్తించారు. (ఇవే బైడెన్ ప్రాథమ్యాలు..!) -
అంగారకుడిపై నీటి సరస్సు!
వాషింగ్టన్: అరుణ గ్రహంపై ఒకప్పుడు భారీ నీటి సరస్సు ఉండేదని అమెరికాకు చెందిన అరిజోనా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంగారకుడిపై 160 కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉన్న ‘లేక్ గుసేవ్’ అనే బిలం ఆ సరస్సుకు చెం దినదేనని గుర్తించినట్లు వారు పేర్కొన్నారు. నాసా పంపిన స్పిరిట్ రోవర్ సహాయంతో ఈ బిలాన్ని పరిశీలించారు. ఆ బిలానికి అనుసంధానమై ఉన్న లోయల ద్వారా వరద ప్రవహించి లేక్ గుసేవ్ను చేరేదని... అది ఆవిరైపోయినప్పుడు మిగిలిన అవక్షేపాలను తాము గుర్తించామని పరిశోధనకు నేతృత్వం వహించిన స్టీవ్ఫ్ ్రచెప్పారు. ఈ బిలం పక్కనే ఉన్న కొ లంబియా కొండల్లో పురాతన రాళ్లను, బిలం దక్షిణ రిమ్లోని కార్బొనేట్ అవక్షేపాలను బట్టి ఒకప్పుడు సరస్సు ఉండేదని భావిస్తున్నట్లు తెలిపారు. -
సిరలకు, గుండెకు మధ్య ‘కృత్రిమ గుండె’!
వాషింగ్టన్: గుండెకు రక్తాన్ని తీసుకొచ్చే సిరలకు గుండె వద్ద కవాటాలుంటాయి. అవి లేకపోతే రక్త ప్రసరణలో ఇబ్బందులు తప్పవు. అయితే ఈ సమస్యకు జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ నరీన్ సర్వజ్ఞన్ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు ఓ చక్కని పరిష్కారం కనుగొన్నారు. సిరల నుంచి రక్తాన్ని తీసుకుని గుండెలోకి ప్రవేశపెట్టే సరికొత్త మినీ గుండెను వారు మూలకణాలతో రూపొందించారు. గుండె సంకోచ, వ్యాకోచాలకు అనుగుణంగా లయబద్ధంగా సంకోచించే ఈ మినీ గుండెను రోగి మూలకణాలతోనే తయారు చే శారు గనక.. దానిని రోగి శరీరం తిరస్కరించే ప్రమాదమూ ఉండదు. దెబ్బతిన్న అవయవాలను బాగుచేయడమే కాదు.. ఇలాంటి ప్రత్యేక అవయవాలను కూడా మూలకణాలతో తయారు చేయవచ్చని తాము నిరూపించామని సర్వజ్ఞన్ పేర్కొన్నారు.