సాక్షి,వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ దేశంలో కరోనా వైరస్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన నిపుణుల బృందానికి నేతృత్వం వహించే అవకాశం భారతీయ అమెరికన్ డాక్టర్‌కు లభించింది. ఈ ‘కోవిడ్–19 టాస్క్ ఫోర్స్’కు నియమించిన ముగ్గురు అధ్యక్షుల్లో భారతీయ అమెరికన్ వైద్యుడు డాక్టర్ వివేక్ మూర్తి ఒకరు. డాక్టర్ డేవిడ్ కెస్లర్, డాక్టర్ మార్సెల్లా నునెజ్ స్మిత్ కూడా ఈ టాస్క్‌ఫోర్స్‌కు నేతృత్వం వహిస్తారు.
కరోనాను కట్టడి చేసే సమగ్ర కార్యాచరణను ఈ టాస్క్ ఫోర్స్ బైడెన్‌కు అందిస్తుంది. కరోనాను కట్టడి చేసేందుకు ప్రత్యేకంగా నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు బైడెన్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సలహా బృందంలో భారతీయ అమెరికన్ అతుల్ గావండే, లూసియానా బోరియొ, రిక్ బ్రైట్ ఉన్నారు. డాక్టర్ వివేక్ మూర్తి 2014 నుంచి 2017 వరకు అమెరికా 19వ సర్జన్ జనరల్‌గా సమర్ధవంతంగా విధులు నిర్వర్తించారు. (ఇవే బైడెన్ ప్రాథమ్యాలు..!)
Comments
Please login to add a commentAdd a comment