సిరలకు, గుండెకు మధ్య ‘కృత్రిమ గుండె’!
వాషింగ్టన్: గుండెకు రక్తాన్ని తీసుకొచ్చే సిరలకు గుండె వద్ద కవాటాలుంటాయి. అవి లేకపోతే రక్త ప్రసరణలో ఇబ్బందులు తప్పవు. అయితే ఈ సమస్యకు జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ నరీన్ సర్వజ్ఞన్ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు ఓ చక్కని పరిష్కారం కనుగొన్నారు. సిరల నుంచి రక్తాన్ని తీసుకుని గుండెలోకి ప్రవేశపెట్టే సరికొత్త మినీ గుండెను వారు మూలకణాలతో రూపొందించారు.
గుండె సంకోచ, వ్యాకోచాలకు అనుగుణంగా లయబద్ధంగా సంకోచించే ఈ మినీ గుండెను రోగి మూలకణాలతోనే తయారు చే శారు గనక.. దానిని రోగి శరీరం తిరస్కరించే ప్రమాదమూ ఉండదు. దెబ్బతిన్న అవయవాలను బాగుచేయడమే కాదు.. ఇలాంటి ప్రత్యేక అవయవాలను కూడా మూలకణాలతో తయారు చేయవచ్చని తాము నిరూపించామని సర్వజ్ఞన్ పేర్కొన్నారు.