arizona state university
-
గొల్లపల్లి యువకుడు భార్గవ్‌కు లక్కీ ఛాన్స్.. ఏడాదికి రూ.1.70 కోట్ల జీతం
సాక్షి, సత్యసాయి జిల్లా(పెనుకొండ): మండలంలోని గొల్లపల్లికి చెందిన భార్గవ్‌కుమార్‌రెడ్డి లక్కీఛాన్స్ కొట్టాడు. ఏడాదికి రూ.1.70 కోట్ల జీతంతో క్వాల్‌కాం మల్టీ ఇంటర్నేషనల్ కంపెనీలో కొలువు దక్కించుకున్నాడు. అమెరికాలోని అరిజోనా యూనివర్సిటీలో ఎంఎస్ (ఎంటెక్) చదువుతున్న భార్గవ్‌కుమార్‌రెడ్డి ఇంకా పట్టా తీసుకోకముందే రూ.కోట్ల కొలువు దక్కించుకున్నాడు. ఆయన చదువు డిసెంబర్లో పూర్తి కానుండగా, అతని నైపుణ్యం గుర్తించిన క్వాల్‌కాం కంపెనీ అంతకుముందే ఏడాదికి రూ. 1.70 కోట్లు ప్యాకేజీ ఇచ్చేలా ఒప్పందం చేసుకుంది. చదువు పూర్తికాగానే క్వాల్‌కాంలో చేరనున్న భార్గవ్‌కుమార్‌రెడ్డి అధునాతన చిప్‌ల తయారీపై పనిచేయాల్సి ఉంటుంది. భార్గవ్ ప్రతిభను గుర్తించిన అరిజోనా యూనివర్సిటీ ఇప్పటికే అతనికి రూ. 20 లక్షలు స్కాలర్ షిప్ ఇవ్వడం విశేషం. ఈ సందర్భంగా భార్గవ్ తల్లిదండ్రులు శ్రీనివాసరెడ్డి, అలివేలమ్మ మాట్లాడుతూ.. తమ కుమారుడు ఏడాదికి రూ.కోటి సంపాదించే ఉద్యోగంలో చేరతాడని తాము ఊహించలేదన్నారు. చిన్నప్పటి నుంచీ కష్టపడి చదివే తమ కుమారుడి ప్రతిభ గుర్తించి ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు విద్యాసంస్థలు ఫీజుల్లో పెద్ద ఎత్తున రాయితీ ఇచ్చాయన్నారు. చదవండి: (పరిటాల సునీత మహానటి.. సహనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దు) -
బాత్రూమ్లో ఫోన్ వాడుతున్నారా.. ఈ సమస్యలు తప్పవా?
అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్ ఫోన్ ఇప్పుడు మన జీవితంలో అంతర్భాగమై పోయింది. గత దశాబ్దంన్నర కాలం నుంచి వ్యక్తులతో కమ్యూనికేట్ అవ్వడం దగ్గర నుంచి , కాలు కదపకుండా హోటల్ నుంచి ఫుడ్ ఇంటికి తెప్పించుకోవడం, ఆన్లైన్ షాపింగ్ వరకూ ఇలా అన్నింట్లో సహాయ పడుతుంది. అయితే దాని వల్ల ఎంత లాభం ఉందో అంతకంటే ఎక్కువ ప్రమాదం ఉందని సైంటిస్ట్‌లు హెచ్చరిస్తున్నారు. ఇటీవల అరిజోనా యూనివర్సిటీ సైంటిస్టులు జరిపిన ఓ అధ్యయనంలో మనం వినియోగించే స్మార్ట్ ఫోన్లలో 17 వేల బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా వినియోగించే టాయిలెట్ సీటు మీద ఉండే బ్యాక్టీరియా కంటే స్మార్ట్ ఫోన్ల మీద 10 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు. ► టీనేజర్లు వినియోగించే ఫోన్లమీద బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్నట్లు అరిజోనా సైంటిస్ట్‌లు చెబుతున్నారు. ఎందుకంటే వారిలో ఎక్కువ మందికి బాత్రూంకు మొబైల్ తీసుకొని వెళ్లే అలవాటు ఉందని , ఎక్కువ సమయం బాత్రూంలో మొబైల్ వినియోగించడం వల్ల ఫోన్‌పై బ్యాక్టీరియా ఏర్పుడుతుందని హెచ్చరిస్తున్నారు. ► 2016లో సోనీ సంస్థ జరిపిన సర్వేలో 41 శాతం మంది ఆస్ట్రేలియన్లు టాయిలెట్లో ఫోన్ వినియోగిస్తుండగా.. 75శాతం మంది అమెరికన్లు వాడుతున్నారు. అయితే అలా ఫోన్ వినియోగిస్తున్న వారు టైం వేస్ట్ చేయకుండా మల్టీ టాస్కింగ్ చేస్తున్నామని అనుకుంటున్నట్లు తేలింది. కానీ టాయిలెట్లో మొబైల్ వినియోగించడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నామనే విషయాన్ని మరిచిపోతున్నారని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ► డాక్టర్ కర్మాకర్ సలహా మేరకు.. ఫోన్‌ను బాత్రూంలోకి లేదంటే పబ్లిక్ ఏరియాల్లో వినియోగించకపోవడం ఉత్తమం. ఆహారం తీసుకునేటప్పుడు కూడా చాలా మంది తమ ఫోన్‌ని ఉపయోగిస్తుంటారు. నోటి ద్వారా ఇన్ఫెక్షన్లు సంక్రమించే అవకాశం ఉంది. కాబట్టి, ఫోన్లోని బ్యాక్టీరియా వల్ల అనారోగ్యానికి గురయ్యే ప్రమాదాల్ని పెంచుతుంది. చదవండి👉 'డాక్టర్ బాబు' నీ సేవలకు సలాం ఫోన్‌ను బాత్రూంలో వినియోగిస్తే వాటిల్లే ప్రమాదాలు ►►ఫోన్ వినియోగిస్తూ బాత్రూంలో ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల పెద్ద ప్రేగుల్లో ఒత్తిడి పెరిగిపోతుంది.తద్వారా రెక్టల్ (మల ద్వార) సమస్యలు ఎక్కవుగా ఉత్పన్నమవుతాయి. ►► పెద్ద ప్రేగుల్లో ఒత్తిడి పెరిగితే జీర్ణాశయాంతర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు గుర్తించాలి ►► బాత్రూంలో ఫోన్ వినియోగిండం వల్ల టైం దుర్వినియోగం అవుతుంది. చేయాల్సిన వర్క్ ఆగిపోతుంది. మనకు తెలియకుండా మన లోపలి శరీరం ఒత్తిడికి గురవుతుంది. ►► మీరు ఉదయం పూట నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకునేందుకు బాత్రూం వెళ్లే సమయంలో ఫోన్‌ను వెంట తీసుకొని వెళుతున్నారా? అయితే మీరు ఉదయం పూట బాత్రూంలో ఫోన్ వినియోగించే సమయం కంటే.. ఫోన్ లేనప్పుడు బాత్రూంలో గడిపే సమయం ఎక్కువగా ఉంటుందని సైంటిస్ట్‌లు చెబుతున్నారు. అందుకే ఉదయం టాయిలెట్లోకి ఫోన్ తీసుకొని వెళ్లకపోవడమే ఉత్తమం. ►► వెడ్ఎమ్డి హెల్త్ జర్నల్ ప్రకారం..ఈ బాక్టీరియాలో సాల్మొనెల్లా, ఇ.కోలి, షిగెల్లా, క్యాంపిలో బాక్టర్ అనే బ్యాక్టీరియాలు మన శరీరంలో ప్రవేశించి అనారోగ్యానికి గురి చేస్తాయి. ►► ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ను వ్యాప్తి చేయడంలో ప్రముఖ పాత్ర పోషించే ఈ ఫోన్‌ను టాయిలెట్లో వినియోగిస్తే గ్యాస్ట్రో, స్టాఫ్ వంటి వైరస్ల ఇతరకు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. చదవండి👉 యాపిల్ లోగోను టచ్ చేసి చూడండి.. అదిరిపోద్దంతే..! ఫోన్ నుంచి సురక్షితంగా ఉండాలంటే ►► నిపుణుల అభిప్రాయం ప్రకారం 60% నీరు, 40% శానిటైజర్లతో ఫోన్‌ను శుభ్రం చేసుకోవాలి. మీ ఫోన్‌ను నేరుగా లిక్విడ్‌తో శుభ్రం చేయడం వల్ల డిస్ప్లే చెడిపోతుందని స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు చెబుతున్నాయి. ►► ఫోన్ నుంచి సురక్షితంగా ఉండాలంటే బాత్రూమ్లోకి తీసుకొని వెళ్లిపోకూడదు. తినేటప్పుడు ఫోన్‌ను వినియోగించపోవడం ఉత్తమం ►► టచ్స్క్రీన్లను శుభ్రం చేయడానికి నిర్దిష్ట స్ప్రేలను కొనుగోలు చేయవచ్చు. స్క్రీన్ ప్రొటెక్ట్ చేసేందుకు సహాయ పడతాయి. ►► బాత్రూమ్ నుండి బయటకు వచ్చినప్పుడు లేదా ఇతరుల స్మార్ట్‌ఫోన్‌ను తాకినప్పుడు చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. చదవండి👉 ‘ఆఫీస్‌కు రండి.. లేదంటే గెట్ ఔట్’! -
సార్వత్రిక టీకాకు ‘మేధోహక్కు’లే ముప్పు
రోగ నిర్థారణ చేయగల పలువురు క్రిమి శాస్త్రవేత్తల అంచనాలను బట్టి, ప్రపంచంలో ఇంతవరకూ కనిపెట్టిన 300 పైగా వైరస్లలో నికార్సయిన పరిపూర్ణ ‘టీకా’ (ఇంజక్షన్) అంటూ వచ్చింది ఒక్క మశూచికి (స్మాల్ ఫాక్స్) మాత్రమేనని తెలుస్తోంది! ఫ్లూ వ్యాధి మూలాలకు ఇప్పటికీ శాశ్వత పరిష్కారం దొరక్కపొయినా, దాని మూలాలను తాత్కాలికంగా అదుపు చేయగల తాత్కాలిక ఉపశమనాలను వైద్యశాస్త్రవేత్తలు ప్రపంచానికి అందించి ప్రజాబాహుళ్యం ఆధరాభిమానాలకు పాత్రులవుతున్నారు.టీకాలు జరూరుగా ప్రపంచమంతా సరఫరా కావాలంటే ప్రపంచంలో మేధో హక్కుల చట్టం అడ్డు రాకూడదన్న బ్రిటిష్ సోషలిస్టు నాయకుడు బెర్నీ శాండర్స్ అన్నమాట అక్షరసత్యం! ప్రకృతి వినాశాన్ని కొని తెచ్చుకునే ప్రపంచీకరణ (గ్లోబలైజేషన్) పేరిట ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక సంస్కరణలు అనేక అనర్థాలకు కారణమవుతున్నాయి. ఫలితంగా మాంసకృత్తులను పెంచే జంతు ప్రొటీన్ల కోసం ఆరాటం పెరిగిపోయిన ఫలితంగా మానవ జాతి ప్రపంచ వ్యాపితంగానే తెలిసిన రోగాలతో పాటు తెలియని అనేక అజ్ఞాత వ్యాధులకు గురవుతూ వస్తోంది. ఈ దుస్థితి గతంలో అంతగా లేదు. ఈ అజ్ఞాత వ్యాధుల్లో భాగమే ‘సార్స్’ వ్యాధి వ్యాప్తి. దాంతో ప్రపంచం ఎంతగా పడుగు పేకలా అల్లుకుపోయిన భూమో మనకు తెలిసొచ్చింది. అంతేగాదు, రకరకాల మహమ్మారి వ్యాధి కారక వైరస్ క్రిములకు రకరకాల గబ్బిలాలు, రిషి పిట్టలూ ఆలవాలంగా మారాయో వెల్లడైంది’’. ►ప్రపంచ వైద్య పరిశోధనా సంస్థ ప్రపంచాన్ని ముమ్మరించనున్న అంటువ్యాధుల (ఇన్ఫెక్షన్)పై హెచ్చరిస్తూ 1992లోనే ప్రచురించిన సాధికార నివేదిక. ►అంతేగాదు, ‘‘ సుమారు 25 వేల సంవత్సరాలకు ముందే నేటి కరోనా (కోవిడ్ 19)ను పోలిన వైరస్ వ్యాధి మనుషులకు సోకింది, ప్రపంచంలోని మానవాళి ఆది నుంచీ ప్రమాదకరమైన విషవ్యాధుల్ని ఎదుర్కుంటూనే ఉన్నారు. అయితే అలాంటి వైరస్‌లను ప్రతిఘటించి బట్టకట్టిన మానవ జీవకణాలలోని సానుకూల శక్తుల సాయంతోనే వైరస్లు దఫదఫాలుగా వచ్చినా తట్టుకుని మానవులు ఉనికిని చాటుకున్నారు! ►అరిజోనా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ డేవిడ్ ఎనార్డ్ ఆధ్వర్యంలో పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తల తాజా అధికార నివేదిక. అంటే ‘‘సార్స్’’ వైరస్ తర్వాత ‘జికా’, ఎబోలా’ వగైరా సరికొత్త వైరస్లు పుట్టగొడుగుల్లా వివిధ ఖండాలలో పెల్లుబుక్కుతూ వస్తున్న దశలోనే తాజా కోవిడ్–19 (కరోనా) వైరస్ కూడా మానవాళిపై విరుచుకుపడి అన్ని ఖండాలను చుట్టుముడుతూ లక్షలు, కోట్లమంది ప్రజల ప్రాణాలు తోడుకుంటోంది. ఈసారి ఈ వైరస్ వ్యాప్తికి ఖండాలు, దేశాలు, పలానా ప్రాంత ప్రజలు, జాతి, కుల, మత వివక్షలు వంటివి లేవు! ఎందుకంటే ‘రోగానికి మందుగాని మనిషి ఆయుర్దాయానికి మందు ఉండదన్నది సామెత. ప్రపంచ శాస్త్రవేత్తలు, రోగ నిర్థారణ చేయగల పలువురు క్రిమి శాస్త్రవేత్తల అంచనాలను బట్టి, ప్రపంచంలో ఇంతవరకూ కనిపెట్టిన 300 పైగా వైరస్లలో నికార్సయిన పరిపూర్ణ ‘టీకా’ (ఇంజక్షన్) అంటూ వచ్చింది ఒక్క మశూచికి (స్మాల్ ఫాక్స్) మాత్రమేనని తెలుస్తోంది! 19వ శతాబ్దంలో వచ్చిన ‘‘స్పానిష్ ఫ్లూ’’ ప్రపంచాన్ని గడగడలాడించి కోట్లాది ప్రజల ప్రాణాలు హరించివేసింది. అయినా ఫ్లూ వ్యాధి మూలాలకు ఇప్పటికీ శాశ్వత పరిష్కారం దొరక్కపొయినా, దాని మూలాలను తాత్కాలికంగా అదుపు చేయగల తాత్కాలిక ఉపశమనాలను వైద్యశాస్త్రవేత్తలు ప్రపంచానికి అందించి ప్రజాబాహుళ్యం ఆధరాభిమానాలకు పాత్రులవుతున్నారు. ఈ లెక్కన నిన్న, మొన్ననే ‘ఉషోదయం’ చూడగలిగిన ‘‘2–డీజీ’’ (రక్షణ శాఖ శాస్త్ర పరిశోధన సంస్థ) సహితం కరోనా వ్యాధి సోకిన వారికి కొంత ఉపశమనం ఇవ్వగల్గిందే గాని, రాక్షస వ్యాధి రాకుండా పూర్తిగా నిరోధించగల శక్తి గలది కాదని డీఆర్డీవో అధినేత సతీష్‌రెడ్డి కూడా భావిస్తున్నారు! అయినా ఆ మేరకైనా కరోనా వ్యాధిగ్రస్తులకు భారీ ఉపశమనం కల్గించబోవడం ఆహ్వానించదగిన పరిణామం. ఎందుకంటే ప్రపంచ ప్రసిద్ధ వైరాలజిస్టులు, జీవశాస్త్రవేత్తలయిన లూయీపాశ్చర్, కోచీలు (18–19 శతాబ్ద) చాలా దూరదృష్టితో ఒక మహా సత్యాన్ని ప్రకటించి, మానవాళిని విజ్ఞానవంతుల్ని చేయడానికి, మూఢవిశ్వాసాలను పటాపంచలు చేయడానికి ప్రయత్నించారు. జీవితం అంటేనే క్రిముల సముదాయం, క్రిములంటేనే జీవితం సుమా! మానవ జీవితాన్ని శాసించే ఆఖరి శక్తులు కూడా క్రిములేనని మరచిపోరాదు’’! అలాగే భారత తొలితరం ప్రముఖ క్రిమి శాస్త్రవేత్త శ్రీమతి గగన్‌దీప్ కాంగ్ సహితం వైరస్ క్రిమి బతికేది కూడా మరో పరాశ్రయ క్రిమి మీదనే, ఇది సృష్టి పరిణామ క్రమంలో అంతర్భాగమని’’ గుర్తించాలని స్పష్టం చేశారు! మానవజాతి పరిణామ క్రమంలో గుహలనే స్వగృహాలుగా మలుచుకుని గడిపిన ఆ అజ్ఞాత ఆదిమ గుçహాంతర జీవులకూ నేటి మానవుల ఉనికి బాధలకూ సంబంధం ఉందని బయోటెక్నాలజీ ప్రొఫెసర్ వినయపాండ్యే తాజా పరిశోధనల్లో తేల్చారు. పరిణామ క్రమంలో భాగంగానే నెదర్లాండ్స్ వైరస్ జీవకణాల్లోని కొన్ని కణాలు వైరస్‌ను ఎదిరించి మరీ మనగలగడం రుజువైందని అలా చెడును ఎదిరించి బతకడాన్ని ఆ ప్రయోజనకర కణాల నుంచే మానవులకు సంక్రమించిన గుణపాఠమనీ పాండ్యే నిర్ధారణ! అదే, జన్యు కణాలలో ప్రయోజనకరమైన వాటిని కాపాడే డీఎన్ఏకూ ఆ కణాలలోని ప్రతికూల శక్తి అయిన ఆర్ఎన్ఏకూ మధ్య నిరంతరం సాగే సంకుల సమర దుందుభులకు అసలు కారణం! బహుశా ఈ వాస్తవం దృష్ట్యానే క్రిమి శాస్త్రవేత్త గగన్‌దీప్ కాంగ్ ప్రస్తుత కరోనా వైరస్ విలయతాండవానికి బహుశా మే ఆఖరు, లేదా ఆ ప్రాంతాలకల్లా సాధ్యమైనంత వరకు ఆటవిడుపు ఉంటుందని అనేక ఉదాహరణలు ఆధారంగా ప్రకటించగలిగి ఉంటారు! అందుకనే సుప్రసిద్ధ పరిణామవాద జీవశాస్త్రవేత్త థియోడోసియస్ డోబ్ ఝాన్సీకి ‘‘సార్స్– కోవిడ్ –2 వైరస్ వ్యాధి పుట్టుక, దాని వ్యాప్తిని పరిశోధించి ఆ వ్యాధి కారణాన్ని నిగ్గుదేల్చిన తరువాత చేసిన కీలకమైన వ్యాఖ్యను మనం మరిచిపోరాదు. ‘‘పరిణామవాద దీపకాంతిలో తప్ప జీవశాస్త్రం విశిష్టత మరో విధంగా తెలియరాదు’’ అని చాటిచెప్పారు! అలాగే సామ్రాజ్యవాద, వలస దోపిడీ విధానాల ఫలితంగా పాత, కొత్త వర్ధమాన దేశాల ఉనికిని, ప్రజాబాహుళ్యం జీవన విధానాలను చెల్లాచెదర చేసిన దారుణ యుద్ధాలు, దోపిడీల ఫలితంగా లెక్కకు మకుటంగా వైరస్లు వ్యాపించి ఆర్ధిక వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసిన చరిత్రను మరచిపోలేం. కనీవినీ ఎరుగని విపత్తుల నుంచి ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని వర్ధమాన దేశాలు ఈ రోజుకీ కోలుకోలేక పోవడానికి అపరిష్కారంగా మిగిలిపోయిన సామాజిక, రాజకీయ, మతపరమైన దారుణ వివక్షలను పాలకులు కొనసాగించడమే కారణం! ప్రసిద్ధ శాస్త్రవేత్తలు, పరిశోధకులు పెక్కుమంది ఉద్దేశం ఈ రోజుకీ కోవిడ్–19(కరోనా సహా) ‘‘ఫ్లూ’’ కు రకరకాల నకళ్లే. కాకపోతే వ్యాధి తీవ్రతలో, ఉధృతిలో తేడాపాడాలు! అందుకే కోవిడ్–19 భారతదేశంలో ‘ఆశ్రయం’ పొంది పెరుగుతున్న వాలకం గమనించిన వైద్యశాస్త్రంలో నిపుణులైన డాక్టర్లు పెక్కుమంది ‘కరోనా’ దాడి ప్రారంభమైనప్పటి నుంచీ కనబడిన రోగులు పెక్కుమందికి ముందు జాగ్రత్తగా ఇన్ఫ్లూయొంజా/ న్యూమోనియా ఇంజక్షన్లని వేయించుకోమని సలహా ఇచ్చారని మరచిపోరాదు. కోళ్లు, కుక్కలకు ఇతర జంతువులకు కూడా కరోనా వ్యాపిస్తున్న ఈ రోజుల్లో చిలకలకూ ‘‘పారెట్ ఫీవర్’’ మొదలైందని వార్తలు వింటున్నాం! ఆధునిక వైద్య పితామహులలో ఒకరుగా పేరొందిన సర్ విలియం ఆస్లర్. ‘ఫ్లూ’ సంబంధిత వ్యాధి న్యూమోనియాను మృత్యువాత పడిన రోగులకు ‘సార్స్’ అని నామకరణం చేశారు! మన దేశం నేడున్న అత్యంత విపత్కర పరిస్థితులలో కూడా ముందు చూపు కరువైన పాలక రాజకీయ నాయకత్వం కనుసన్నలలోనే, వారి ఆధ్వర్యంలోనే వందలు, వేలల్లో లాభాల వేటకు మోసులెత్తగా, ఇంకొక వైపున అసంఖ్యాక పేద మధ్య తరగతి వర్గాలు, వ్యవసాయ, పారిశ్రామిక కార్మికులూ పరాయి పంచల్లో బతుకులీడుస్తూ రోడ్లపాలై బతుకులు వెల్లబుచ్చుకుంటున్నారు. అందుకే టీకాలు జరూరుగా ప్రపంచమంతా సరఫరా కావాలంటే ప్రపంచంలో మేధో హక్కుల చట్టం అడ్డు రాకూడదన్న బ్రిటిష్ సోషలిస్టు నాయకుడు బెర్నీ శాండర్స్ అన్నమాట అక్షరసత్యం! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
వేల ఏళ్ల క్రితమే కరోనా కజిన్ సిస్టర్!
కరోనా.. ఈ పేరు వింటేనే వణుకు పుడుతున్న సమయమిది. దాదాపు ఏడాదిన్నర కింద మొదలైన ఈ మహమ్మారి ఇంకా ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. నిజానికి కరోనా వైరస్ ఇప్పటిదేనా అంటే.. కాదట.. సుమారు 25 వేల ఏళ్ల ముందే కరోనాను పోలిన వైరస్ మనుషులకు సోకిందట. ఇప్పుడు అప్పుడూ అని కాదు.. మనుషులు తొలినాళ్ల నుంచీ ప్రమాదకర వైరస్‌లను ఎదుర్కొంటూనే ఉన్నారని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అలా వైరస్‌లను ఎదుర్కొన్నప్పటి సామర్థ్యం జన్యువుల రూపంలో తర్వాతి తరాలకు అందిందని.. అందుకే కొత్త కొత్త వైరస్లు వచ్చినా తట్టుకోగలుగుతున్నారని అంటున్నారు. ఈ అంశంపై ప్రొఫెసర్ డేవిడ్ ఎనార్డ్ ఆధ్వర్యంలో అరిజోనా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధన చేసి.. ఇటీవలే నివేదిక విడుదల చేశారు. మానవులు సమాజంగా ఏర్పడి జీవించడం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఏదో ఒక రకమైన వైరస్ దాడికి గురవుతూనే ఉన్నారు. అలా వైరస్లు విజృంభించినప్పుడల్లా కొందరు వాటిని తట్టుకుని జీవించగలిగారు. అలాంటి వారిలో వైరస్‌లను ఎదుర్కొనే సామర్థ్యానికి కారణమైన జన్యువులు తర్వాతి తరాలకు అందుతూ, మరింతగా అభివృద్ధి చెందుతూ వచ్చాయి. ఈ క్రమంలో వేల ఏళ్ల కిందటి ఆయా వైరస్ల జాడలు డీఎన్ఏలో ఉండిపోతాయి. వాటిని పరిశీలించడం ద్వారా అప్పటి పరిస్థితులను అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. ఈ మేరకు కరోనా వైరస్‌కు సంబంధించి.. ప్రపంచవ్యాప్తంగా 26 ప్రాంతాల నుంచి 2,504 మంది జన్యుక్రమంపై అరిజోనా వర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. అప్పటి వైరస్‌తోనే తూర్పు ఆసియాలో.. మనుషుల్లో కొన్ని వేల రకాల ప్రొటీన్లు ఉంటాయి. మన శరీరంలోకి ప్రవేశించిన కరోనా ఇలాంటి కొన్ని ప్రొటీన్లను ఆధారం చేసుకునే.. కణాల్లో ప్రవేశించి, తన సంతతిని పెంచుకుంటుంది. ప్రస్తుతం కరోనా వైరస్‌కు, శరీర కణాలకు మధ్య 420 రకాల ప్రొటీన్లు కీలకమని.. అందులో 332 ప్రొటీన్లు కరోనాకు అనుకూలంగా ఉండగా, మిగతావి వైరస్‌ను ఎదుర్కోవడంలో కణాలకు సాయం చేస్తాయని గుర్తించారు. ఇలా కరోనాను ఎదుర్కొనే ప్రొటీన్లు, వాటి ఉత్పత్తి కారణమయ్యే జన్యువులను శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఈ ప్రొటీన్లు ప్రపంచవ్యాప్తంగా సాధారణంగా ఉండగా.. తూర్పు ఆసియా దేశాలకు చెందినవారిలో మరింత సమర్థవంతంగా ఉన్నట్టు తేల్చారు. ఈ ప్రొటీన్లు ఇలా సమర్థవంతంగా మారడానికి కొన్ని జన్యుమార్పులు కారణమని.. సుమారు 25 వేల ఏళ్ల కిందటే ఈ మార్పులు మొదలయ్యాయని గుర్తించారు. అంటే అప్పటి నుంచే కరోనాను పోలిన వైరస్లు తూర్పు ఆసియా, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రభావం చూపుతున్నాయని, అందుకే అక్కడి వారిలో కరోనాను ఎదుర్కొనే శక్తి ఏర్పడి ఉంటుందని అంటున్నారు. ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టు..! ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టుగా.. వైరస్ల వల్లనే వైరస్‌లను ఎదుర్కొని నిలిచే శక్తి మనుషులకు వచ్చిందని డేవిడ్ ఎనార్డ్ చెప్పారు. ‘‘వేల ఏళ్లనాడు వైరస్‌లను తట్టుకుని జీవించగలిగిన వారు.. తర్వాతి తరాలకు మూలంగా నిలిచారు. వారిలోని సమర్థవంతమైన జన్యువులు తర్వాతి తరాలకు సంక్రమించాయి. ఇలా క్లిష్ట పరిస్థితులను తట్టుకునేలా మనుషుల్లో పరిణామం రావడానికి అప్పటి వైరస్‌లే ప్రధాన కారణం’’అని వివరించారు. ఇప్పుడు తాము చేసిన పరిశోధన కరోనా వంటి మహమ్మారులు విజృంభిస్తే ఎలా ఎదుర్కోవాలన్న దానికి మార్గనిర్దేశం చేయగలదని తెలిపారు. తూర్పు ఆసియా అంటే..? ఆసియా ఖండంలోని చైనా, జపాన్, మంగోలియా, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, తైవాన్ దేశాలను తూర్పు ఆసియా దేశాలుగా పేర్కొంటారు. ఇక వాటికి సమీపంగా ఉన్న దేశాలను చూస్తే నేపాల్, భూటాన్, మయన్మార్, థాయ్‌లాండ్, వియత్నాం, ఫిలిప్పీన్స్ దేశాలు ఉంటాయి. అరిజోనా వర్సిటీ నివేదిక ప్రకారం.. తూర్పు ఆసియా దేశాల వారికి కరోనా సోకినా తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంది. చుట్టుపక్కల పలు దేశాల్లోనూ వైరస్‌ను ఎదుర్కొనే శక్తి కొంత వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. -
ఆరో వినాశనం.. ఇలా ఆపేద్దాం!
వాషింగ్టన్: భూమి చరిత్రలో ఆరో వినాశనం త్వరలోనే ఉండనుందా..? ఇప్పటివరకు ఐదు సమూహ వినాశనాలతో తల్లడిల్లిన భూమికి ఆరో వినాశనం తప్పదా..? అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. రానున్న ఆ ఆరో వినాశనానికి మూల కారకులు మానవులేనని కూడా చెబుతున్నారు. భూమిపై జీవ వైవిధ్యాన్ని, సమతుల్యతను కాపాడి ఆరో వినాశనాన్ని తప్పించేందుకు రూపొందించిన ఓ విధానం అమలుకు ఏడాదికి రూ.7 లక్షల కోట్లు అవసరమవుతాయని ఆయన వెల్లడించారు. ఇది కూడా ఎంత వీలైతే అంత త్వరగా చేపట్టాలని, తద్వారా మానవ నిర్మిత జీవవైవిధ్యం ద్వారా జరిగే విధ్వంసాన్ని ఈ దశాబ్దంలోనే అడ్డుకోవచ్చని స్పష్టం చేశారు. ఆరో వినాశనం మానవుడి భుజస్కందాలపై ఉందని, ఏం చేయాలో తేల్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని అమెరికాలోని అరిజోనా స్టేట్ యూనివర్సిటీకి చెందిన ఎకాలజిస్ట్ గ్రెగ్ అస్నర్ తెలిపారు. భూమిపై జీవవైవిధ్యాన్ని, సమృద్ధిని కాపాడటానికి ‘ఏ గ్లోబల్ డీల్ ఫర్ నేచర్(జీడీఎన్)’అనే సైన్స్ పాలసీని రూపొందించిన 19 మంది అంతర్జాతీయ పరిశోధకుల్లో అస్నర్ ఒకరు. ఈ ఖర్చు అంత భారీదేమీ కాదని, అమెరికాలోని యాపిల్, బెర్క్‌షైర్ హాత్వే కంపెనీలు 2018లో ఆర్జించిన లాభాలతో ఇది సమానమన్నారు. రెండో అతిపెద్ద నిర్ణయం.. భూ వినాశనాన్ని అడ్డుకునేందుకు తీసుకున్న నిర్ణయాల్లో జీడీఎన్ రెండో అతిపెద్ద నిర్ణయం కాగా.. మొదటిది 2015లో తీసుకున్న పారిస్ ఒప్పందం. ‘అయితే పారిస్ ఒప్పందం ఒక్కటే భూమిపై జీవ వైవిధ్యాన్ని, మానవాళికి అవసరమైన పర్యావరణాన్ని సంరక్షించలేదు. దీని కోసం మరొక ప్రత్యామ్నాయం అవసరం. శాస్త్ర ఆధారిత, నిర్ణీత కాల పాలసీ అయిన ది గ్లోబల్ డీల్ ఫర్ నేచర్ భూమిపై జీవ వైవిధ్యాన్ని, సమృద్ధిని కాపాడగలదు. భూ వినాశనాన్ని ఆపడానికి నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడంలో జీడీఎన్ పాలసీకి తిరుగులేదు. భావితరాలకు మనం ఇవ్వబోయే అతిపెద్ద బహుమతి ఈ పాలసీ మాత్రమే. జీడీఎన్ పాలసీలో మూడు లక్ష్యాలను నిర్దేశించాం’అని అమెరికాలోని నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్‌కు చెందిన ఎరిక్ డైనర్స్టెయిన్ వెల్లడించారు. ఈ పరిశోధన ఫలితాలు సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. మన నిబద్ధతను పునరుద్ఘాటిద్దాం: మోదీ వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే సవాళ్లను తగ్గించడంలో దేశ నిబద్ధతను పునరుద్ఘాటించేందుకు ధరిత్రీ దినోత్సవం ఓ సందర్భం అని ప్రధాని మోదీ అన్నారు. ధరిత్రీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన మాట్లాడుతూ..‘భూమాతకు మనం భక్తితో నమస్కరిస్తాం. ఏళ్లుగా అసాధారణ వైవిధ్యాలకు ఈ భూగ్రహం ఓ నిలయం. మన గ్రహం శ్రేయస్సు కోసం స్థిరమైన అభివృద్ధి, వాతావరణ మార్పులను తగ్గించడంలో మన నిబద్ధతను ఈ రోజున మరోసారి పునరుద్ఘాటిస్తున్నాం’అని అన్నారు. -
ఏటా 18 కోట్ల టన్నుల ఇంటిపంటల దిగుబడి!
నగరాలు, పట్టణాల్లో ఇళ్ల మధ్య, ఇళ్లపైన ఖాళీ స్థలాల్లో సేంద్రియ ఇంటిపంటలు సాగు చేయటం ప్రపంచమంతటా విస్తరిస్తున్నది. ఇంతకీ పట్టణ, నగర ప్రాంతాల్లో సేంద్రియ ఇంటిపంటల ద్వారా ఏటా ఎంత పంట పండించవచ్చు? దాని విలువ ఎంత?? 10 నుంచి 18 కోట్ల టన్నుల ఆహారాన్ని ఉత్పత్తి చేయొచ్చని ఈ ఆహారం విలువ ఏకంగా 8,000 కోట్ల నుంచి 16,000 కోట్ల డాలర్లని అమెరికాకు చెందిన అరిజోనా స్టేట్ యూనివర్సిటీ తాజాగా లెక్క తేల్చింది. ఈ అంశంపై ఇదే తొట్టతొలి సమగ్ర అధ్యయనంగా భావిస్తున్నారు. నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ఆర్థిక తోడ్పాటుతో.. ఆహార, వ్యవసాయ సంస్థ గణాంకాలు.. గూగుల్ ఎర్త్ ఇంజిన్ సాంకేతిక సహకారంతో ఈ అధ్యయనం జరిగింది. ఈ అధ్యయనం వివరాలను అమెరికన్ జియోఫిజికల్ యూనియన్‌కు చెందిన ‘ఎర్త్ ఫ్యూచర్’ జర్నల్ ఇటీవల ప్రచురించింది. సేంద్రియ ఇంటిపంటల వల్ల ప్రయోజనం చక్కని ఆహారం మాత్రమే కాదండోయ్.. పర్యావరణ సేవలు కూడా భారీగానే అందుతున్నాయి. అంతేకాక, పట్టణాల్లో ఇంటిపంటల చల్లదనం వల్ల ఏటా 1,400–1,500 కోట్ల కిలోవాట్ అవర్స్ మేరకు విద్యుత్తు ఆదా అవుతుంది. లక్ష నుంచి లక్షా 70 వేల టన్నుల నత్రజనిని ప్రతి ఏటా ఇంటిపంటలు మట్టిలో స్థిరీకరిస్తాయి. 4,500–5,700 కోట్ల క్యూబిక్ మీటర్ల మేరకు వర్షపు నీరు వృథాగా కొట్టుకుపోకుండా ఇంటిపంటలు ఒడిసిపట్టగలుగుతాయని అంచనా. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ పర్యావరణ సేవలన్నిటి విలువ ఏకంగా 3,300 కోట్ల డాలర్లట! -
అంగారకుడిపై నీటి సరస్సు!
వాషింగ్టన్: అరుణ గ్రహంపై ఒకప్పుడు భారీ నీటి సరస్సు ఉండేదని అమెరికాకు చెందిన అరిజోనా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంగారకుడిపై 160 కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉన్న ‘లేక్ గుసేవ్’ అనే బిలం ఆ సరస్సుకు చెం దినదేనని గుర్తించినట్లు వారు పేర్కొన్నారు. నాసా పంపిన స్పిరిట్ రోవర్ సహాయంతో ఈ బిలాన్ని పరిశీలించారు. ఆ బిలానికి అనుసంధానమై ఉన్న లోయల ద్వారా వరద ప్రవహించి లేక్ గుసేవ్ను చేరేదని... అది ఆవిరైపోయినప్పుడు మిగిలిన అవక్షేపాలను తాము గుర్తించామని పరిశోధనకు నేతృత్వం వహించిన స్టీవ్ఫ్ ్రచెప్పారు. ఈ బిలం పక్కనే ఉన్న కొ లంబియా కొండల్లో పురాతన రాళ్లను, బిలం దక్షిణ రిమ్లోని కార్బొనేట్ అవక్షేపాలను బట్టి ఒకప్పుడు సరస్సు ఉండేదని భావిస్తున్నట్లు తెలిపారు.