ఫలప్రదంగా జరుగుతాయని ఆశిస్తున్నా | Hope would carry through | Sakshi
Sakshi News home page

ఫలప్రదంగా జరుగుతాయని ఆశిస్తున్నా

Published Wed, Jul 22 2015 12:13 AM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM

ఫలప్రదంగా జరుగుతాయని ఆశిస్తున్నా - Sakshi

ఫలప్రదంగా జరుగుతాయని ఆశిస్తున్నా

న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఫలప్రదంగా జరుగుతాయని.. ప్రాధాన్యత ప్రకారం సమావేశాలను సాగనిస్తామని పలు రాజకీయ పార్టీలు గత పార్లమెంటు సమావేశాల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆశాభావం వ్యక్తంచేశారు.

సోమవారం నాటి అఖిలపక్ష భేటీ మంచి వాతావరణంలో జరిగిందన్నారు. ఆయన మంగళవారం ఉదయం పార్లమెంటు భవనంలో విలేకరులతో మాట్లాడుతూ.. దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపేందుకు సమష్టి నిర్ణయాలు తీసుకోవటానికే ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తోందని పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల్లో ఎంపీల మద్దతుకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ.. ప్రస్తుత సమావేశాల్లో మంచి నాణ్యమైన చర్చలకు, సభా కార్యకలాపాలకు పార్లమెంటు సభ్యులందరూ కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement