హైపర్‌లూప్ వన్ ముందడుగు
సూపర్‌స్పీడ్‌తో పరుగులు పెట్టే హైపర్‌లూప్ రవాణా టెక్నాలజీ ఇంకో ముందడుగు వేసింది. తక్కువ పీడనము న్న గొట్టాల్లో అయస్కాంత క్షేత్రంపై ప్రయాణించే క్యాబి న్లను వాస్తవ సైజులో తొలిసారి పరీక్షించామని హైపర్ లూప్ వన్ అనే కంపెనీ ప్రకటించింది. నాలుగేళ్ల కింద టెస్లా అధినేత ఎలన్ మస్క్ గంటకు 1,200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల హైపర్‌లూప్ వ్యవస్థ ఆలో చనను ప్రకటించడం.. హైపర్‌లూప్ వన్‌తో పాటు మరో 2 కంపెనీలు ప్రయత్నాలు ప్రారంభించడం తెలిసిందే.
హైప ర్‌లూప్ వన్ భారత్‌తో పాటు 5 దేశాల్లోనూ తమ టెక్నాల జీని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోం ది. దాదాపు 28 అడుగుల పొడవైన క్యాబిన్ ఒకదాన్ని విజ యవంతంగా పరీక్షించారు. తొలి పరీక్షలో క్యాబిన్ గంటకు 112 కి.మీ. వేగంతో దూసుకెళ్లిందని, మలిదశలో గంటకు 400 కి.మీ. వేగంతో పరీక్షలు జరుపుతామని హైపర్‌లూప్ వన్ వ్యవస్థాపకుడు షెర్విన్ పిషెవార్ తెలిపారు. 2020 నాటికి ముందుగా సరుకుల రవాణా, తర్వాతి ఏడాది మానవుల రవాణా చేపడతామని అంటున్నారు.