ఈ కార్ల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
న్యూఢిల్లీ: కార్ల ధరల పెంపులో దిగ్గజ కార్ల ఉత్పత్తి సంస్థలు పోటీపడుతున్నాయి. టాటా మోటార్, టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకెఎం), నిస్సాన్ వరుసగా ధరలను పెంచితే తాజాగా హ్యుందయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ కూడా అదే బాటలో నడుస్తోంది. మిగిలిన సంస్థలు 3 శాతం దరలను పెంచితే హ్యుందాయ్ మాత్రం భారీగా పెంచేసింది. సుమారు లక్ష రూపాయలవరకు వాహనాల ధరలను పెంచుతున్నట్టు మంగళవారం ప్రకటించింది.
అధిక ఉత్పత్తి వ్యయాలు, కరెన్సీ ఒడిదుడుకులు, భారీగా పెరిగిన మార్కెటింగ్ ధరల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఇయర్ ఎండ్ మార్కెట్ పరిస్థితుల్లో నిలకడలేని రూపాయి మారకపు రేటు, పెరుగుతున్న మార్కెటింగ్ ఖర్చులు తదితర సవాళ్ల నేపథ్యంలో ధరల పెంచక తప్పలేదని హెచ్ఎంఐఎల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ తెలిపారు. ప్రతిపాదిత ధర పెరుగుదల రూ 1,00,000 వరకు ఉండనున్నట్టు వెల్లడించారు. ఇయాన్ నుంచి శాంటా ఫే వరకు అన్ని మోడళ్లపై జనవరి, 2017 నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తుందని తెలిపారు.
ఎంట్రీ లెవల్ ఇయాన్ కారు(రూ.3.27లు)నుంచి ఎస్ యూవీ శాంటీ ఫే (ఎక్స్-షోరూమ్ ఢిల్లీరూ.31.98లక్షలు) వాహనాలను కంపెనీ విక్రయిస్తుంది. కాగా ఇటీవల టాటా మెటార్స్ టయోటా 3శాతం ధరలు పెంచగా, నిస్సాన్ 30వేలకు పెంచుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందేవరకు పెంచిన సంగతి తెలిసిందే.