గుమ్మిడిపూండి(నెల్లూరు జిల్లా) : రైలు మార్గం గుండా తమిళనాడు రాజధాని చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అక్రమంగా బియ్యం తరలిస్తున్న ముఠాను నెల్లూరుజిల్లా అధికారులు పట్టుకున్నారు. దాదాపు 1500 కేజీల బియ్యాన్ని లోకల్ రైలులో తరలిస్తుండగా గుమ్మిడిపూండి రెవెన్యూ అధికారులు వలపన్ని సరుకును స్వాధీనం చేసుకున్నారు.
బియ్యం అక్రమ రవాణాపై సమాచారం అందుకున్న గుమ్మిడిపూండి టీఎస్వో ఇళవరసి.. పౌర సరఫరాల శాఖ సిబ్బందితో కలసి శుక్రవారం ఏళావూర్, గుమ్మిడిపూండి, కవరపేట, తదితర స్టేషన్లలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో లోకల్ రైల్లో సీట్ల కింద 45 బియ్యం బస్తాలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీటిని పంజెట్టిలోని పౌరసరఫరాల గోదాముకు తరలించారు.
చెన్నై టు ఏపీ; బియ్యం అక్రమ రవాణ
Published Fri, Jun 16 2017 8:55 PM | Last Updated on Tue, Sep 5 2017 1:47 PM
Advertisement
Advertisement