అన్నాడీఎంకే విజయాన్ని అడ్డుకోలేరు
Published Mon, Jan 27 2014 1:05 AM | Last Updated on Sat, Sep 2 2017 3:02 AM
గుమ్మిడిపూండి, న్యూస్‌లైన్: రానున్న పార్లమెంటు ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయాన్ని ఏ కూటమీ అడ్డుకోలేదని రాష్ట్ర మంత్రి వలర్మతి అన్నారు. గుమ్మిడిపూండి బజారువీధిలో అన్నాడీఎంకే యువజన శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ విజయాలను వివరించే బహిరంగసభ జరిగింది. ఈ సభకు యువజనశాఖ జిల్లా కార్యదర్శి ముల్లైవేందన్ నేతృత్వం వహించగా యూనియన్ కార్యదర్శి గోపాల్‌నాయుడు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథులుగా మంత్రులు వలర్మతి, బీవీ రమణ పాల్గొన్నారు. మంత్రి వలర్మతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జయలలిత ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు.
అమ్మ పనితీరును జాతీయ పత్రికలు కొనియాడుతుంటే రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు ఇది మింగుడుపడడం లేదన్నారు. డీఎంకే అధినేత కరుణానిధి లోక్‌సభ ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం పాకులాడుతున్నారని తెలిపారు. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటమి తప్పదని పేర్కొన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో 40 స్థానాల్లో అన్నాడీఎంకే గెలుపు కోసం కార్యకర్తలు ఇప్పటి నుంచే కృషిచేయాలని పిలుపు నిచ్చారు. అనంతరం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రభుత్వ విజయాలను వివరించారు. ఎమ్మెల్యేలు పొన్‌రాజా, మణిమారన్, జిల్లా చైర్మన్ రవిచంద్రన్, జిల్లా కౌన్సిలర్లు నారాయణమూర్తి, ఎన్.శ్రీధర్, యూనియన్ చైర్మన్ గుణమ్మ, వైస్ చైర్మన్ నాగలక్ష్మి పాల్గొన్నారు.
Advertisement
Advertisement