'ఢిల్లీ'పై వెంటనే నిర్ణయం తీసుకోండి: సుప్రీం
న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేస్తున్న కేంద్రం, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పై సుప్రీంకోర్టు కన్నెర్ర చేసింది. ప్రజాస్వామ్యంలో రాష్టపతి పాలన ఎక్కువ కాలం కొనసాగడం మంచిది కాదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.
ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుపై లెఫ్టినెంట్ గవర్నర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. దీనికి ఐదు నెలల సమయం తీసుకోవాల్సిన అవసరం లేదని చురక అంటించింది. తాము తగినంత సమయం ఇచ్చినప్పటికీ నిర్ణయం తీసుకోలేకపోయారని ఆక్షేపించింది.
కాగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ ఆహ్వానించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ కు రాష్ట్రపతి అనుమతిచ్చారని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ పిటిషన్ మెరిట్ ఆధారంగా వాదనలు వింటామని న్యాయస్థానం పేర్కొంది.