కోల్‌కతాలో రూ.45 కోట్లు హవాలా డబ్బు పట్టివేత | Income Tax Seizes Rs. 45 Crore Cash From Kolkata in Hawala Raids | Sakshi
Sakshi News home page

కోల్‌కతాలో రూ.45 కోట్లు హవాలా డబ్బు పట్టివేత

Published Fri, Sep 25 2015 1:17 AM | Last Updated on Sun, Sep 3 2017 9:54 AM

కోల్‌కతాలో రూ.45 కోట్లు హవాలా డబ్బు పట్టివేత

కోల్‌కతాలో రూ.45 కోట్లు హవాలా డబ్బు పట్టివేత

కోల్‌కతా/న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను శాఖ గురువారం కోల్‌కతా, పరిసర ప్రాంతాల్లో హవాలా డీలర్లపై జరిపిన దాడుల్లో 45 కోట్ల రూపాయల నల్లధనం దొరికింది. అక్రమపద్ధతుల్లో ఆర్జించిన ఈ నల్లధనాన్ని మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు పంపుతున్నట్లుగా ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. నిఘా విభాగం నుంచి అందిన సమాచారం మేరకు... కోల్‌కతా ఐటీ అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో అలీపూర్ పోలీసుస్టేషన్ పరిధి లో నాలుగు చోట్ల, శరత్‌బోస్ రోడ్డులో ఒక ఆఫీసుపై దాడి చేశారు.

16 గోనెసంచుల్లో, 27 ట్రావెల్ బ్యాగుల్లో, 2 అల్మారాల్లో కుక్కిన దాదాపు 45 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. జి సిస్టమ్స్, ఎఫ్.పి.ఎంటర్‌ప్రైజెస్ సంస్థలకు చెందిన డబ్బుగా గుర్తించారు. ఎస్.నాగార్జున, సాంటియాగో మార్టిన్‌లను ఈ హవాలా రాకెట్‌కు మూలకారకులుగా గుర్తిం చారు. పలు రాష్ట్రాల్లో విస్తరించిన నకిలీ లాటరీ రాకెట్‌ను ఈ ముఠా నడుపుతున్నట్లు అనుమానిస్తున్నారు. గుట్టలుగా దొరికిన డబ్బును లెక్కించేందుకు 12 కౌంటింగ్ మిషన్లు వాడారు.  45 కోట్లు ఉంటుందని చెబుతున్నా.. ఈ మొత్తం 50-55 కోట్లు ఉండొచ్చని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement