ముంబై: పోస్టాఫీసుల్లో సేవింగ్స్ ఖాతా ఉన్న వారికి శుభవార్త. ఇకపై పోస్టాఫీసుల్లో కూడా ఏటీఎంలు రాబోతున్నాయి. వచ్చే ఏడాది సెప్టెంబర్‌కల్లా దేశవ్యాప్తంగా మూడు వేల ఏటీఎంలు, లక్షా 35 వేల మైక్రో ఏటీఎంలు నెలకొల్పాలని తపాలా శాఖ యోచిస్తోందని ఆ శాఖ కార్యదర్శి పద్మినీ గోపీనాథ్ వెల్లడించారు. ఫిబ్రవరి 5న న్యూఢిల్లీ, చెన్నై, బెంగళూరుల్లో ఒక్కో ఏటీఎం ప్రారంభిస్తున్నామని, క్రమంగా వాటిని దేశమంతా విస్తరిస్తామని ఆమె ఆదివారం ఇక్కడ విలేకరులతో చెప్పారు.
ఈ ప్రాజెక్టుకు సాంకేతిక సహకారం అందించడానికి సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌తో భారత తపాలా శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. మైక్రో ఏటీఎంలు చేతిలో ఇమిడిపోయే పరికరం. దీనిని పోస్టాఫీసు స్థాయిలో ఉపయోగించవచ్చు. ఇక ఏటీఎంలు వాణిజ్య బ్యాంకుల ఏటీఎంల మాదిరిగానే పనిచేస్తాయి.