బూట్లు తగులబెట్టినందుకు ఏడాది జైలు | Indian jailed for burning ex-girlfriend's shoe, bed in UAE | Sakshi
Sakshi News home page

బూట్లు తగులబెట్టినందుకు ఏడాది జైలు

Published Sun, Feb 8 2015 7:01 PM | Last Updated on Sat, Sep 2 2017 9:00 PM

బూట్లు తగులబెట్టినందుకు ఏడాది జైలు

బూట్లు తగులబెట్టినందుకు ఏడాది జైలు

దుబాయ్: తన మాజీ ప్రియురాలు మంచం, బూట్లను దగ్ధం చేసిన భారతీయుడొకరికి దుబాయ్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. నిందితుడు ఏఆర్(26) మద్యం మత్తులో ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు.

జుమీరాహ్ పామ్ ప్రాంతంలోని ఓ హోటల్ లో వెయిటర్ గా పనిచేస్తున్న నిందితుడు గతేడాది అక్టోబర్ లో ఈ నేరానికి ఒడిగట్టాడు. అతడి మాజీ ప్రియురాలు ఫిలిపినా అదే హోటల్ లో రిసెప్షనిస్ట్ గా పనిచేస్తోంది.

నిందితుడు దొంగతనంగా ఫిలిపినా గదిలోకి ప్రవేశించి ఆమె బూట్లు, మంచానికి నిప్పుపెట్టాడు. ప్రియురాలి ప్రాణానికి అపాయం కలిగించేలా వ్యవహరించినందుకు, ఆమె వస్తువులకు, హోటల్ ఆస్తకి నష్టం కలిగించినందుకు అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement