వావ్‌!! మన హైదరాబాదీకి ప్రపంచ ఘనత! | Indian model Rohit Khandelwal becomes first Asian to win Mr World | Sakshi
Sakshi News home page

వావ్‌!! మన హైదరాబాదీకి ప్రపంచ ఘనత!

Published Wed, Jul 20 2016 5:14 PM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM

వావ్‌!! మన హైదరాబాదీకి ప్రపంచ ఘనత! - Sakshi

వావ్‌!! మన హైదరాబాదీకి ప్రపంచ ఘనత!

భారత టాప్ మోడల్, హైదరాబాద్‌కు చెందిన రోహిత్ ఖందేల్‌వాల్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. మిస్టర్ వరల్డ్ -2016 టైటిల్‌ను ఆయన సొంతం చేసుకున్నాడు. బ్రిటన్‌లోని సౌత్‌పోర్ట్‌లోని సౌత్‌పోర్ట్ థియేటర్ అండ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనకు ఈ టైటిల్‌ను ప్రదానం చేశారు. మిస్టర్ వరల్డ్ టైటిల్ అందుకున్న మొట్టమొదటి ఆసియన్ రోహితే కావడం గమనార్హం.

హైదరాబాద్‌కు చెందిన రోహిత్‌ తాను ఈ ఘనత సాధించడంపై హర్షం వ్యక్తం చేశాడు. '2016 మిస్టర్ వరల్డ్‌గా నిలువడం అదృష్టంగా భావిస్తున్నా. నా అభిమానులకు, నాకు ఆశీస్సులు అందజేసిన అందరికీ కృతజ్ఞతలు. మీ ప్రేమ, మీరు అందించిన స్ఫూర్తి వల్లే నేను ఈ టైటిల్ సాధించాను. ఇప్పటివరకు నా ప్రయాణం గొప్పగా సాగింది. ఇక ముందు ఏం జరగనుందో చూడాలి' అని 26 ఏళ్ల రోహిత్ పేర్కొన్నాడు. మిస్టర్ వరల్డ్ పోటీలో ప్యూర్టోరికాకు చెందిన 21 ఏళ్ల ఫెర్నాండో అల్వరెజ్ మొదటి రన్నరప్‌గా, మెక్సికోకు చెందిన ఎస్పార్జా రెమిరెజ్ (26) రెండో రన్నరప్‌గా నిలిచాడు. టాప్ మోడల్ అయిన రోహిత్ గతంలో పలు టీవీ సీరియళ్లలో నటించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement