Rohit Khandelwal
-
మేల్ మోడల్స్
సాక్షి, వీకెండ్: సిటీలో మేల్ మోడలింగ్ రంగం మరోసారి సగర్వంగా ఒళ్లు విరుచుకుంది. నగరం నుంచి పలువురు ఆజానుబాహులు ఇప్పటికే మోడల్స్‌గా దేశవ్యాప్తంగా రాణిస్తుంటే.. తాజాగా నగరవాసి రోహిత్ ఖండేల్వాల్ మిస్టర్ వరల్డ్ కిరీటం సొంతం చేసుకోవడం ఆ కాంతులకు మరింత వన్నెలు తెచ్చింది. – ఎస్.సత్యబాబు మోడలింగ్ రంగం స్త్రీ పురుషులకు సమాన అవకాశాలు అందిస్తుందనేది తెలిసిందే. అయితే ఇది అమ్మాయిల విషయంలో కాస్త ఎక్కువ అని చెప్పాలి. సహజంగానే ఈ రంగం వైపు యువతులు కాస్త సందేహంగా చూస్తుంటారు కాబట్టి.. పురుషుల కన్నా అమ్మాయిల రాకే తక్కువ. అందుకే వారికే డిమాండ్ ఎక్కువ. పరిస్థితులు అంత అనుకూలంగా లేనప్పటికీ.. నగరం నుంచి మేల్ మోడల్స్‌గా రాణిస్తున్న వారి సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. ఎందరో మోడల్స్.. కొందరే హీరోస్ రోహిత్ విశ్వవిజేతగా నిలిచిన నేపథ్యంలో సిటీ మళ్లీ వార్తల్లో నిలిచింది. అయితే గతంలోనూ పురుషుల అందాల పోటీలలో నగరం చెప్పుకోదగ్గ స్థాయిలో పార్టీసిపెంట్స్ను పంపించి కొద్దో గొప్పో టైటిల్స్‌ను కూడా అందుకుంది. పురుషుల గ్లామర్ కాంటెస్ట్‌లు నిర్వహించడంలో ముందుండే గ్రాసిమ్, గ్లాడ్రాగ్స్... తదితర దుస్తుల బ్రాండ్స్ అందించే టైటిల్స్ కోసం నగరం నుంచి పెద్ద సంఖ్యలోనే పోటీదారులు హాజరయ్యేవారు. వీరిలో పలువురు టైటిల్స్ గెలుచుకున్నారు కూడా. సిటీకి చెందిన రెగీ వర్గీస్ తొలి మిస్టర్ ఇండియాగా కిరీటం దక్కించుకోగా... అంతకు మించిన స్థాయి టైటిల్‌ను రోహిత్ సాధించాడు. ఇక సిటీకి చెందిన శ్రీధర్ మిస్టర్ ఫిజిక్, బెస్ట్ డ్రెస్డ్ మేల్ టైటిల్స్ గెలుచుకున్నాడు. అనంతరం భారీ కార్పొరేట్ కంపెనీలకు మోడలింగ్ ఛాన్స్ దక్కించుకొని సినీ నటుడు కూడా అయ్యాడు. ఇప్పటికి దాదాపు 15 సినిమాల్లో విలన్‌గా, క్యారెక్టర్ నటుడిగా నటించాడు. అదే కోవలో కరణ్ సింగ్, ఫర్హాద్, వాసు తదితరులు గ్లాడ్రాగ్స్, గ్రాసిమ్ నిర్వహించిన పోటీలలో తమ సత్తా చాటారు. వీరు కూడా తమదైన శైలిలో సినీ, టీవీ రంగాల్లో రాణిస్తున్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని మరెందరో యువకులు మోడలింగ్ వైపు ఆకర్షితులు అయ్యారు. యువతుల జోరు.. కుదేలైన కుర్రాళ్లు అయితే కాలక్రమంలో మోడలింగ్ పూర్తిగా యువతుల ఆధిపత్య రంగంగా మారిపోయింది. పురుషులకు కూడా సమాన అవకాశాలు ఉన్నప్పటికీ మేల్ మోడల్స్ ఎక్కువ కావడంతో మంద ఎక్కువై మజ్జిగ పలచనైన చందంగా మారింది. అమ్మాయిలతో పోలిస్తే వీరికి రెమ్యునరేషన్ నుంచి అన్నీ తక్కువే. జాతీయ స్థాయిలో టైటిల్స్ గెలుచుకున్నవారు కూడా సినిమాల్లో అరకొర అవకాశాలతో కాలం గడిపేస్తున్నారు. మరోవైపు వీధివీధినా యువతుల అందాల పోటీల సందడి ఎక్కువైపోయి.. అదే సమయంలో మేల్ కాంటెస్ట్‌లు తగ్గిపోతున్నాయి. జరుగుతున్న పోటీల్లోనూ మన సిటీకి పెద్దగా విజయాలు లేవు. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా భారత్‌కు దక్కని మిస్టర్ వరల్డ్ కిరీటం రోహిత్ అందించడం, అతను కూడా మన నగరానికి చెందిన యువకుడు కావడంతో... మళ్లీ మేల్ మోడలింగ్‌కు మంచి రోజులు వస్తాయని నగర మోడల్స్ నమ్ముతున్నారు. వారి నమ్మకం నిజం కావాలని కోరుకుందా ఫ్యూచర్.. సూపర్ మేల్ మోడల్స్‌కి మంచి డిమాండ్ ఉంది. బ్యూటీ కాంటెస్ట్‌లలో టైటిల్స్ విజయాలతో సంబంధం లేకుండా మంచి ఫిజిక్, ఫేస్ కట్ ఉన్న ప్రతి ఒక్కరికీ మోడలింగ్‌లో అవకాశాలు లభిస్తున్నాయి. మిగిలిన మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ ఈ రంగంలో ఇంకా తప్పటడుగుల దశలోనే ఉంది. కాబట్టి ఈ రంగంలో ఉజ్వల భవిష్యత్ ఉందనేది నిస్సందేహం. – అన్వర్, కొరియోగ్రాఫర్, లఖోటియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మోడలింగ్ -
మిస్టర్ వరల్డ్ రోహిత్‌కు ఘన స్వాగతం
శంషాబాద్: మిస్టర్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న హైదరాబాదీ రోహిత్ ఖండేల్వాల్కు గురువారం శంషాబాద్ విమానాశ్రయంలో అభిమానులు, కుటుంబ సభ్యులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రోహిత్ మీడియాతో మాట్లాడుతూ.. తన విజయాన్ని దేశానికి అంకితమిస్తున్నట్లు తెలిపారు. తన గెలుపు వెనుక కోచ్ రాహుల్‌తో పాటు కుటుంబ సభ్యుల పాత్ర మరువలేనిదన్నారు. భవిష్యత్‌లో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పారు. -
మిస్టర్ వరల్డ్‌గా హైదరాబాదీ
-
మిస్టర్ వరల్డ్‌గా హైదరాబాదీ
- పురుషుల మోడలింగ్ ప్రపంచంలో భారత్‌కు తొలి టైటిల్ - ఫైనల్లో 46 మందితో పోటీలో నెగ్గిన రోహిత్ - భారతీయుల అభిమానమే గెలిపించింది..: రోహిత్ సాక్షి, హైదరాబాద్: మిస్టర్ వరల్డ్ చాంపియన్‌షిప్ చరిత్రలో తొలిసారిగా ఓ భారతీయుడు.. అదీ మన హైదరాబాదీ విజేతగా నిలిచాడు. మంగళవారం రాత్రి ఇంగ్లండ్‌లోని సౌత్‌పోర్ట్‌లో జరిగిన ఫైనల్స్‌లో 46 దేశాలకు చెందిన ఫైనలిస్ట్‌లతో పోటీపడి.. రోహిత్ ఖండేల్వాల్ (26) మిస్టర్ వరల్డ్-2016 టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. పురుషుల మోడలింగ్ ప్రపంచంలో ఇప్పటిదాకా భారత్‌కు దక్కిన మిస్టర్ వరల్డ్ టైటిల్ ఇదే కావడం విశేషం. అవార్డుతో పాటు 50 వేల అమెరికన్ డాలర్ల నగదు బహుమతి రోహిత్ అందుకున్నాడు. మిస్టర్ వరల్డ్-2014 టైటిల్ విజేత నిక్లస్ పెడెర్సన్.. రోహిత్‌కు టైటిల్‌ను అందజేశారు. ప్యూర్టో రికోకు చెందిన ఫెర్నాండో అల్వరేజ్ (21), మెక్సికోకు చెందిన ఎస్పార్జా రామిరెజ్ (26) వరుసగా తర్వాత స్థానాల్లో నిలిచారు. రో‘హిట్’ జర్నీ సాగిందిలా.. హైదరాబాద్‌లోని అరోరా డిగ్రీ కాలేజీలో రోహిత్ చదువుకున్నాడు. తండ్రి రాజ్‌కుమార్ ఖండేల్వాల్. ఈ కుర్రాడికి చిన్నప్పటి నుంచి హిందీ సినిమాలంటే పిచ్చి. డిగ్రీ పూర్తి చేశాక స్పైస్‌జెట్‌లో గ్రౌండ్ స్టాఫ్‌లో పనిచేసి, అనంతరం డెల్ కంప్యూటర్స్‌లో టెక్నికల్ సపోర్ట్ అసిస్టెంట్‌గా చేశాడు. రెండేళ్ల క్రితం ఎంబీఏ చేయడానికి ముంబై వెళ్లాడు. అప్పు డే మోడలింగ్ రంగానికి చేరువయ్యాడు. ఇందుకోసం 85 కిలోలకు పైగా బరువు నుంచి ఆర్నెల్ల్లలోనే 15 కిలోలు తగ్గాడు. టీవీ కమర్షియల్స్, యాడ్స్, ర్యాంప్ షోలతో మోడలింగ్ కెరీర్ ప్రారంభించి తలుపు తట్టిన ప్రతి అవకాశాన్ని అందుకున్నాడు. హైదరాబాద్‌లో ఉండగా నుక్తాంగన్ చైల్డ్ ఎంపవర్మెంట్, బ్లైండ్ పీపుల్ వెల్ఫేర్.. తదితర సంస్థలతో పనిచేశాడు.పర్సనాల్టీ డెవలప్మెంట్ సెషన్స్ నిర్వహించాడు. వి చానల్ తదితర టీవీ కార్యక్రమాలు చేశాడు. బాలీవుడ్లో యే హై ఆషికిలో చేసిన వీర్ పాత్ర, ప్యార్తునే క్యా కియాలో చేసిన శ్రీధర్ పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టాయి. మిస్టర్ ఇండియా యాడ్ చూసి ఆడిషన్స్‌కి వెళ్లి, ప్రిపరేషన్స్‌కి ఒక్క నెల మాత్రమే ఉన్నా.. అప్పటికప్పుడు టాలెంట్ రౌండ్ కోసం ఫ్రెండ్ దగ్గర మ్యూజిక్ నేర్చుకుని.. గ్రౌండ్లో 20 లీటర్ల వాటర్ క్యాన్ మోస్తూ 20 రౌండ్లు కొట్టడం వంటి కఠినమైన వర్కవుట్స్ చేశాడు. మిస్టర్ ఇండియా టైటిల్‌తో పాటు మిస్టర్ యాక్టివ్, బెస్ట్ యాక్టర్, మిస్టర్ ఫొటోజెనిక్ అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడు. అదే ఊపులో మిస్టర్ వరల్డ్ టైటిల్‌కు గురిపెట్టాడు. జూలై 17 నుం చి 19 వరకు సౌత్ లండన్‌లో జరిగిన పోటీ లో రాణించి భారత్‌కు పురుషుల గ్లామర్ ప్రపంచంలో ఫస్ట్ టైటిల్‌ను అందించాడు. నమ్మలేకపోతున్నా: రోహిత్ ‘మిస్టర్ వరల్డ్ టైటిల్ గెలవడం ఇంకా నమ్మలేకపోతున్నాను. చాలా గర్వంగా, ఆనందంగా ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చి, ప్రోత్సహించిన మిస్ ఇండియా ఆర్గనైజేషన్‌కు కృతజ్ఞతలు. నా కుటుంబం, స్నేహితులు మద్దతుతోనే ఇది సాధ్యమైంది’ అని రోహిత్ అన్నాడు. భారతీయులు చూపించిన అభిమానమే తనను టైటిల్ గెలిచేలా చేసిందని చెప్పాడు. కాగా, మిస్టర్ వరల్డ్ మల్టీమీడియా అవార్డు, మిస్టర్ వరల్డ్ టాలెంట్, మోబ్స్టార్ పీపుల్స్ చాయిస్ అవార్డ్స్, మిస్టర్ వరల్డ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ల్లోనూ పాల్గొన్న రోహిత్.. మిస్టర్ వరల్డ్ మల్టీమీడియా అవార్డును గెలుచుకున్నాడు. -
వావ్!! మన హైదరాబాదీకి ప్రపంచ ఘనత!
భారత టాప్ మోడల్, హైదరాబాద్‌కు చెందిన రోహిత్ ఖందేల్వాల్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. మిస్టర్ వరల్డ్ -2016 టైటిల్‌ను ఆయన సొంతం చేసుకున్నాడు. బ్రిటన్‌లోని సౌత్పోర్ట్లోని సౌత్‌పోర్ట్ థియేటర్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనకు ఈ టైటిల్‌ను ప్రదానం చేశారు. మిస్టర్ వరల్డ్ టైటిల్ అందుకున్న మొట్టమొదటి ఆసియన్ రోహితే కావడం గమనార్హం. హైదరాబాద్‌కు చెందిన రోహిత్ తాను ఈ ఘనత సాధించడంపై హర్షం వ్యక్తం చేశాడు. '2016 మిస్టర్ వరల్డ్‌గా నిలువడం అదృష్టంగా భావిస్తున్నా. నా అభిమానులకు, నాకు ఆశీస్సులు అందజేసిన అందరికీ కృతజ్ఞతలు. మీ ప్రేమ, మీరు అందించిన స్ఫూర్తి వల్లే నేను ఈ టైటిల్ సాధించాను. ఇప్పటివరకు నా ప్రయాణం గొప్పగా సాగింది. ఇక ముందు ఏం జరగనుందో చూడాలి' అని 26 ఏళ్ల రోహిత్ పేర్కొన్నాడు. మిస్టర్ వరల్డ్ పోటీలో ప్యూర్టోరికాకు చెందిన 21 ఏళ్ల ఫెర్నాండో అల్వరెజ్ మొదటి రన్నరప్‌గా, మెక్సికోకు చెందిన ఎస్పార్జా రెమిరెజ్ (26) రెండో రన్నరప్‌గా నిలిచాడు. టాప్ మోడల్ అయిన రోహిత్ గతంలో పలు టీవీ సీరియళ్లలో నటించాడు.