
మిస్టర్ వరల్డ్ రోహిత్‌కు ఘన స్వాగతం
శంషాబాద్: మిస్టర్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న హైదరాబాదీ రోహిత్ ఖండేల్‌వాల్‌కు గురువారం శంషాబాద్ విమానాశ్రయంలో అభిమానులు, కుటుంబ సభ్యులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రోహిత్ మీడియాతో మాట్లాడుతూ.. తన విజయాన్ని దేశానికి అంకితమిస్తున్నట్లు తెలిపారు. తన గెలుపు వెనుక కోచ్ రాహుల్‌తో పాటు కుటుంబ సభ్యుల పాత్ర మరువలేనిదన్నారు. భవిష్యత్‌లో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పారు.