న్యూఢిల్లీ: రైల్వేలో భద్రత, సామర్థ్యం మెరుగుపరిచేందుకు ఆ శాఖ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోతో త్వరలో పరస్పర ఒప్పందం కుదుర్చుకోనుంది. రైల్వే మార్గం, భవనాలు, భూములు, వర్క్‌షాప్‌ల వంటి తదితర విషయాలను భౌగోళిక సమాచార వ్యవస్థ (జీఐఎస్) ద్వారా తెలుసుకోనుంది. ఒప్పందం రైల్వే ప్రమాదాలు అరికట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు.