కీలకమైన జీడీపీ గణాంకాలు వచ్చేశాయ్! | India's GDP grows 7.3% in September quarter | Sakshi
Sakshi News home page

కీలకమైన జీడీపీ గణాంకాలు వచ్చేశాయ్!

Published Wed, Nov 30 2016 6:06 PM | Last Updated on Mon, Sep 4 2017 9:32 PM

India's GDP grows 7.3% in September quarter

పెద్ద నోట్ల రద్దు వల్ల వృద్ధి రేటుపై పోటు పడుతుందని పలు రేటింగ్ సంస్థలు అంచనావేస్తున్న నేపథ్యంలో మార్కెట్ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన జీడీపీ ఫలితాలు నేడు విడుదలయ్యాయి. మార్కెట్ వర్గాలకు శుభసూచికగా జూలై-సెప్టెంబర్ మధ్య కాలంలో జీడీపీ రేటు 7.3 శాతానికి పెరిగినట్టు ప్రభుత్వ గణాంకాల్లో వెల్లడైంది. గత క్వార్టర్లో ఈ రేటు 7.1 శాతంగా ఉంది. గత త్రైమాసికం కంటే ఈ త్రైమాసికంలో దేశీయ ఎకానమీ శరవేగంగా వృద్ధి చెందినట్టు ఈ గణాంకాల్లో తెలిసింది. అదేవిధంగా ఈ రేటు పెంపుతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎకానమీలో భారత్ ఒకటిగా మరోసారి రుజువు చేసుకుంది. కానీ నవంబర్ 9 నుంచి హఠాత్తుగా రద్దైన పాత రూ.500, రూ.1000 నోట్ల వల్ల దేశమంతటా నగదు సమస్య ఏర్పడిందని, ఇది వచ్చే నెలల్లో వృద్ధిరేటు ప్రభావం చూపవచ్చని విశ్లేషకులంటున్నారు. 
 
ఈ ఆర్థికసంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటును అత్యధికంగా 8 శాతం నమోదుచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ హఠాత్తుగా పెద్దనోట్లను రద్దుచేస్తున్నట్టు నిర్ణయం తీసుకోవడంతో సమీప కాలంలో వృద్ధి రేటుపై ప్రభావం చూపుతుందని పలు రేటింగ్ సంస్థలు సైతం అంచనావేస్తున్నాయి. 2017-18 ఆర్థికసంవత్సర వృద్ధి రేటు అంచనాలను కుదిస్తూ వస్తున్నాయి. కరెన్సీరద్దు స్వల్పకాలంలో ప్రభావం చూపినా.. దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూరుస్తుందని అవి పేర్కొంటున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement