గాంధీనగర్: 1993 ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి దావూద్ ఇబ్రహీం ను ఎలాగైనా పట్టుకుని తీరుతామని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. 'దావూద్ చేసిన పనులను మరిచిపోలేదు. అతను చట్టం కళ్లు కప్పి తిరుగుతున్నాడు. ఎలాగైనా సరే దావూద్ను చట్టపరిధిలోకి తీసుకుంటాం' అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం దావూద్ విడుదల చేసిన వీడియో ఆధారంగా అతను పాకిస్థాన్ లో ఉన్నట్లు అనుమానాలు ఉన్నట్లు ఆయన తెలిపారు.
ఇరాక్ లో అదృశ్యమైన భారతీయులు గురించి మీడియా ప్రశ్నించగా.. తాము ప్రస్తుతం అదే పనిలో ఉన్నామన్నారు. అక్కడ ఏమి జరిగింది అనే అంశంపై స్వల్పంగా మాత్రమే సమాచారం ఉందని.. ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించి వివిధ మార్గాల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నామన్నారు.
దావూద్ ను పట్టుకుని తీరుతాం:భారత్
Published Fri, Jan 9 2015 1:34 PM | Last Updated on Sat, Sep 2 2017 7:27 PM
Advertisement
Advertisement