అప్పుడే పుట్టిన శిశువు నడిరోడ్డుపై... | Infant found at road | Sakshi
Sakshi News home page

అప్పుడే పుట్టిన శిశువు నడిరోడ్డుపై...

Published Tue, Sep 8 2015 11:34 PM | Last Updated on Tue, Aug 21 2018 7:34 PM

Infant found at road

విశాఖపట్నం క్రైమ్: మానవత్వం కొంచమైనా లేని కొందరు అప్పుడే పుట్టిన మగ శిశువును వదిలి వెళ్లగా... నిర్జీవ స్థితిలో, వాహనాలు తొక్కేసిన స్థితిలో ఆ పసికందును స్థానికులు గుర్తించారు. విశాఖ నగరంలోని ముడసర్లోవ రిజర్వాయర్ సమీపంలో బీఆర్‌టీఎస్ రోడ్డుపై మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో మృత శిశువు ఉన్నట్టు అరిలోవ పోలీసులకు సమాచారం అందింది.

పోలీసులు వెళ్లి చూడగా ఆ శిశువు చనిపోయి ఉంది. వాహనాలు మీద నుంచి వెళ్లిపోవడంతో చిధ్రమై ఉంది. శిశువు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని అక్కడే పూడ్చిపెట్టారు. కాగా, ఈ పసికందును కారులో నుంచి బయటకు విసిరేసి వెళ్లినట్టు స్థానికంగా ప్రచారం జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement