5 శాతం పెరిగిన ఇన్ఫోసిస్ షేరు
ముంబై: స్టాక్ మార్కెట్ లో ఇన్ఫోసిస్ షేరు 5 శాతం పెరిగాయి. మూడో త్రైమాసిక(క్యూ3) ఫలితాల్లో 13 శాతం వృద్ధి నమోదు చేయడంతో ఇన్ఫోసిస్ షేరు బాగా లాభపడింది. 2014-15 మూడో త్రైమాసికంలో రూ. 3,250 కోట్ల నికర లాభం ఆర్జించినట్టు ఇన్ఫోసిస్ ప్రకటించింది. టీసీఎస్ షేరు 2.8 శాతం, విప్రో షేరు 1.54 శాతం వృద్ధి నమోదు చేశాయి.
ఆద్యంతం ఊగిసలాటలో కొనసాగిన స్టాక్ మార్కెట్ చివరకు లాభాలతో ముగిసింది. ప్రారంభంలో బాగా పెరిగిన మార్కెట్ చివర్లో అమ్మకాల ఒత్తిడితో లాభాలు తగ్గించుకుంది. సెన్సెక్స్ 183 పాయింట్లు లాభపడి 27,458 వద్ద ముగిసింది. ఎస్ఎస్ఈ సూచీ నిఫ్టీ 50 పాయింట్లు ఎగసి 8,284 వద్ద స్థిరపడింది.