ఉగ్రవాదుల తలలతో కూర వండుతోంది | Iraqi woman on rampage, beheads ISIS terrorists, cooks their heads | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదుల తలలతో కూర వండుతోంది

Published Fri, Sep 30 2016 6:56 PM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM

ఉగ్రవాదుల తలలతో కూర వండుతోంది

ఉగ్రవాదుల తలలతో కూర వండుతోంది

బాగ్దాద్: ఉగ్రవాదుల చేతిలో కుటుంబాన్ని పోగొట్టుకున్న ఓ మహిళ.. ఇప్పుడు అదే ఉగ్రవాదుల వెన్నులో వణుకుపుట్టిస్తోంది. తన చేతికి చిక్కిన ముష్కరులను తెగనరుకుతూ వారి తలలతో కూరలు వండుతోంది. ఐసిస్ చీఫ్ బాగ్దాదీ సైతం 'ఆమెకు దొరకకుండా జాగ్రత్త పడండి' అని  జిహాదీలను హెచ్చరించాడంటే అతిశయంకాదు. ఆమె పేరు వహీదా మహమ్మద్ అలియాస్ ఉమ్ హనది. ప్రస్తుతం ఇరాకీ మిలటరీ కమాండర్ గా పనిచేస్తున్న ఆమె ఇంత క్రూరంగా మారడానికి కారణం ఐసిస్, అల్ కాయిదాలే!

ఇరాక్ లోని ఓ ఊళ్లో సంతోషంగా కాలం గడుపుతోన్న వహీదా కుటుంబాన్ని అల్ కాయిదా, ఐసిస్ ఉగ్రమూకలు సర్వనాశనం చేశాయి. ఉగ్రవాదుల దాడుల్లో వహీదా ఇద్దరు భర్తలు, తండ్రి, ముగ్గరు సోదరులు చనిపోయారు. ఉగ్రవాదులపై పగతీర్చుకోవాలనుకున్న ఆమె 2004లో ఇరాకీ సైన్యంలో చేరారు. ప్రస్తుతం కమాండర్ స్థాయిలో ముష్కరమూకల పనిబడుతోంది. వహీదా తనకు చిక్కిన ఉగ్రవాదుల తలలు నరికి వాటిని వండుతోందని గతంలో కొన్ని రిపోర్టులు వెలువడ్డాయి. ఇప్పుడు స్వయంగా ఆమె.. నరికి తలలను చేతులతో పట్టుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఐసిస్ కు సింహస్వప్నం
తమ జిహాదీలను కర్కశంగా చంపుతోన్న వహీదాను మట్టుపెట్టేందుకు ఐసిస్, అల్ కాయిదాలు చేయని ప్రయత్నమంటూ లేదు. 2006 నుంచి 2014 మధ్యకాలంలో కారులో బాంబులు పెట్టడం తదితర విధాలుగా వహీదాను అంతం చేసేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. కానీ అన్నిసార్లూ విఫలమయ్యారు. అతి సమీపంగా జరిగిన ఒక దాడిలో వహీదా తలకు, చేతులకు గాయాలయ్యాయి. అయినాసరే ఐసిస్ కు సింహస్వప్నంగా నిలబడింది ఆమె. అంతేకాదు ఐసిస్ చరనుంచి తన స్వగ్రామాన్ని సైతం విడపించింది. 'ఇరాక్ ప్రధానమంత్రి కంటే తనను చంపడానికే ఐసిస్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందం'టోన్న వహీదా.. చివరి రక్తపుబొట్టు వరకూ ఉగ్రవాదులతో పోరాడుతూనే ఉంటానని చెబుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement