12 మంది ఉగ్రవాదుల తలలు నరికిన ఐఎస్ | IS beheads 12 Al Qaeda, Jaish al-Islam men | Sakshi
Sakshi News home page

12 మంది ఉగ్రవాదుల తలలు నరికిన ఐఎస్

Published Fri, Jun 26 2015 8:01 PM | Last Updated on Fri, Aug 17 2018 7:36 PM

12 మంది ఉగ్రవాదుల తలలు నరికిన ఐఎస్ - Sakshi

12 మంది ఉగ్రవాదుల తలలు నరికిన ఐఎస్

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు సిరియాలో విచిత్రమైన ఘాతుకానికి పాల్పడ్డారు. అల్ కాయిదా, జైష్ అల్ ఇస్లామ్ గ్రూపులకు చెందిన 12 మంది ఉగ్రవాదుల తలలు నరికి చంపేశారు. ఈ మేరకు ఓ వీడియో కూడా విడుదల చేశారు. సిరియా రాజధాని డమాస్కస్లో ఈ వీడియో చిత్రీకరించారు. ఈ 12 మందిని ఇంటర్వ్యూ చేసి, కెమెరా ముందు పెరేడ్ చేయించి.. తర్వాత తలలు నరికేశారు. ఇస్లామిక్ స్టేట్ను వ్యతిరేకించిన నేరాన్ని వాళ్లు ఆమోదించారని, అందుకే వాళ్లను ఇస్లామిక్ స్టేట్కు చెందిన ఒక ముసుగు వ్యక్తి తలలు నరికేశాడని అంతర్జాతీయ మీడియాలో కథనం వచ్చింది.

ఆ వీడియోలో అల్ కాయిదా, జైష్ అల్ ఇస్లామ్ సంస్థలకు చెందినవాళ్లు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో పోరాడుతున్న సన్నివేశాలు కూడా ఉంటాయి. సిరియా ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇస్లామిక్ స్టేట్కు బద్ధులై ఉండాలన్న సందేశం ఈ వీడియోలో అంతర్లీనంగా కనపడుతుంది. సాధారణంగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఎప్పుడూ గెడ్డం గీసుకుని కనిపించరు. కానీ ఈ వీడియోలో మాత్రం అతడు నేరుగా కెమెరా ముందు క్లీన్ షేవ్ చేసుకుని కనిపిస్తాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement