ఐఎస్ రాక్షస రాజ్యాంగం | IS giant Constitution | Sakshi
Sakshi News home page

ఐఎస్ రాక్షస రాజ్యాంగం

Published Wed, Dec 30 2015 2:10 AM | Last Updated on Sun, Sep 3 2017 2:46 PM

ఐఎస్ రాక్షస రాజ్యాంగం

ఐఎస్ రాక్షస రాజ్యాంగం

ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు బరితెగించారు. బానిసలుగా పట్టుకున్న మహిళల్ని తమ కామవాంఛల్ని

♦ బానిస మహిళలతో సెక్స్ తప్పుకాదు
♦ ఇస్లామిక్ స్టేట్ ఫత్వా జారీ
 
 వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు బరితెగించారు. బానిసలుగా పట్టుకున్న మహిళల్ని తమ కామవాంఛల్ని తీర్చుకునేందుకు వాడుకోవచ్చంటూ  ఏకంగా ఫత్వా జారీ చేశారు. ఐఎస్ సిద్ధాంతకర్తలు రూపొందించిన ఈ రాక్షస రాజ్యాంగం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఈ ఏడాది మేలో  సిరియాలో అమెరికా జరిపిన దాడులతో ఈ ఘోర వాస్తవం వెలుగుచూసింది. బానిస మహిళల విషయంలో వ్యవహరించే విధానాల్ని పునర్ నిర్వచిస్తూ ఈ ఫత్వా జారీచేశారు. దాడి సమయంలో దొరికిన కొన్ని కీలక డాక్యుమెంట్లను రాయిటర్స్ వార్తా సంస్థ విశ్లేషించింది.  వందల ఏళ్ల క్రితం బోధనల్ని పునర్ నిర్వచిస్తూ  తమ అధీనంలో ఉన్న సిరియా, ఇరాక్ ప్రాంతాల్లో సెక్సువల్ బానిస విధానాన్ని  సమర్థించుకుంటూ ఫత్వా జారీచేసింది.

 ఈ ఫత్వాలోని కొన్ని ముఖ్య అంశాలు...
► బానిస మహిళ రుతుక్రమం పూర్తైఆమె శుద్ధి అయ్యే వరకూ యజమాని ఆమెతో సెక్స్‌లో పాల్గొనకూడదు.
► ఒక వేళ బానిస మహిళ గర్భవతి అయితే ఆమె బిడ్డకు జన్మనిచ్చే వరకూ ఎలాంటి సంబంధం పెట్టుకోకూడదు.
► బానిస మహిళకు యజమాని విముక్తి కల్పిస్తే తర్వాత ఎప్పుడైనా అతను తప్ప వేరే ఎవరూ ఆమెతో సెక్స్ చేయకూడదు.
► బానిస మహిళకు యుక్త వయసు కూతురు ఉండి యజమాని ఆమెతో సంబంధం పెట్టుకుంటే, తర్వాత నుంచి తల్లితో ఎట్టి పరిస్థితుల్లో కలవకూడదు.
► బానిసలైన అక్కాచెల్లెళ్లకు యజమానిగా ఉంటే ఎవరో ఒకరితోనే సంబంధం పెట్టుకోవాలి.
► తండ్రికి బానిస మహిళ ఉంటే అతని కొడుకు ఆమెతో శారీరక సంబంధం పెట్టుకోవద్దు.
► యజమాని కారణంగా బానిస గర్భవతి అయితే ఆమెను ఎవరికీ అమ్మకూడదు. యజమాని మరణిస్తే ఆమెకు విడుదల లభిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement