టంప్‌ ఒక మూర్ఖుడు: ఐసిస్‌ | ISIS message calls Trump 'foolish idiot' | Sakshi
Sakshi News home page

టంప్‌ ఒక మూర్ఖుడు: ఐసిస్‌

Published Thu, Apr 6 2017 4:20 AM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM

టంప్‌ ఒక మూర్ఖుడు: ఐసిస్‌ - Sakshi

టంప్‌ ఒక మూర్ఖుడు: ఐసిస్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఓ బుద్ధిహీనుడు, మూర్ఖుడు అంటూ తీవ్రవాద సంస్థ ఐసిస్‌ అపహాస్యం చేసింది. ట్రంప్‌ అధికారంలోకి రావడం అమెరికా దివాళా తీయడానికి సంకేతమని ఎద్దేవా చేసింది. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్‌ గురించి ఐసిస్‌ వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి.

 ఐసిస్‌ ప్రతినిధి అబూ హసన్‌ అల్‌–ముహజిర్‌ 36 నిమిషాల నిడివి గల ఓ ఆడియో విడుదల చేశాడు. అందులో ట్రంప్‌ను విమర్శిస్తూ పలు వ్యాఖ్యలు చేశాడు. ట్రంప్‌కి సిరియా, ఇరాక్‌ అంటే గానీ, ఇస్లాం గురించి గానీ అసలు ఏమాత్రం అవగాహన లేదని, అందుకే ఇస్లాంపై ద్వేషం పెంచుకున్నాడని దుయ్యబట్టాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement