కశ్మీర్లో భారీగా మోహరించిన బలగాలు | J&K: 11 killed, over 200 hurt as Burhan Wani’s death sparks violence, protests | Sakshi
Sakshi News home page

కశ్మీర్లో భారీగా మోహరించిన బలగాలు

Published Sun, Jul 10 2016 10:34 AM | Last Updated on Mon, Sep 4 2017 4:33 AM

J&K: 11 killed, over 200 hurt as Burhan Wani’s death sparks violence, protests

కశ్మీర్: జమ్మూకశ్మీర్ కు పెద్ద మొత్తంలో కేంద్ర బలగాలు తరలి వెళ్లాయి. దాదాపు 1,200 మందితో కూడిన కేంద్ర సాయుధ బలగాలను ప్రభుత్వం దక్షిణ కశ్మీర్ లోని కల్లోలిత ప్రాంతాలకు మోహరిస్తోంది. ముందస్తు భద్రతలో భాగంగానే ఈ ఏర్పాట్లు చేసినట్లు ఆర్మీ అధికారులు చెప్పారు.

హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ కాల్చివేతకు వ్యతిరేకంగా జమ్మూ-కశ్మీర్ లో వేర్పాటువాదులు నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు 12 మంది ప్రాణాలుకోల్పోగా 200మందికి పైగా గాయాలపాలయ్యారు. కాగా, నిరసనల్లో కశ్మీరీ యువకుల మృతిపట్ల జమ్మూ-కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబుబా ముఫ్తీ ఆవేదన వ్యక్తం చేశారు. అనవసరంగా ఎవరు చేసే కుట్రలోనో భాగస్వామ్యం కావొద్దని హితవు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement