జయలలితకు పాకిస్థాన్ టీవీ జేజేలు | Jaya's rice scheme for mosques lauded by Pak TV channel: AIADMK | Sakshi
Sakshi News home page

జయలలితకు పాకిస్థాన్ టీవీ జేజేలు

Published Fri, Jun 19 2015 11:20 AM | Last Updated on Sat, Mar 23 2019 8:33 PM

జయలలితకు పాకిస్థాన్ టీవీ జేజేలు - Sakshi

జయలలితకు పాకిస్థాన్ టీవీ జేజేలు

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను పాకిస్థాన్ టీవీ చానల్ 'సమ్మా' ప్రశంసల్లో ముంచెత్తింది. ముస్లింల కోసం తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాన్ని తమ దేశంలోనూ అమలు చేయాలని 'సమ్మా' అభిలషించింది. రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్రవాప్తంగా ఉన్న 3 వేలకుపైగా మసీదులకు 4,500 టన్నుల బియ్యం ఉచితంగా సరఫరా చేసేలా జయలలిత ఉత్తర్వులు జారీ చేశారు. మసీదుల వద్ద గంజి పంపిణీ చేయడానికి ఈ బియ్యం వినియోగించనున్నారు.

తమ అధినేత్రి  తీసుకున్న ఈ నిర్ణయాన్ని 'సమ్మా' ఎంతో ప్రశంసించిదని తమ అధికార పత్రిక 'డాక్టర్ నమదు ఎంజీఆర్'లో అన్నాడీఎంకే పార్టీ తెలిపింది. విజయ సూచిక చూపిస్తున్న జయలలిత ఫోటో, పార్టీ రెండాకుల గుర్తును ప్రసారం చేసిందని వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement