జయలలితకు పాకిస్థాన్ టీవీ జేజేలు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను పాకిస్థాన్ టీవీ చానల్ 'సమ్మా' ప్రశంసల్లో ముంచెత్తింది. ముస్లింల కోసం తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాన్ని తమ దేశంలోనూ అమలు చేయాలని 'సమ్మా' అభిలషించింది. రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్రవాప్తంగా ఉన్న 3 వేలకుపైగా మసీదులకు 4,500 టన్నుల బియ్యం ఉచితంగా సరఫరా చేసేలా జయలలిత ఉత్తర్వులు జారీ చేశారు. మసీదుల వద్ద గంజి పంపిణీ చేయడానికి ఈ బియ్యం వినియోగించనున్నారు.
తమ అధినేత్రి తీసుకున్న ఈ నిర్ణయాన్ని 'సమ్మా' ఎంతో ప్రశంసించిదని తమ అధికార పత్రిక 'డాక్టర్ నమదు ఎంజీఆర్'లో అన్నాడీఎంకే పార్టీ తెలిపింది. విజయ సూచిక చూపిస్తున్న జయలలిత ఫోటో, పార్టీ రెండాకుల గుర్తును ప్రసారం చేసిందని వెల్లడించింది.