జియో వల్ల ప్రభుత్వానికి ఎంత నష్టమో తెలుసా? | Jio's free voice and data services costs government Rs 685 crore | Sakshi
Sakshi News home page

జియో వల్ల ప్రభుత్వానికి ఎంత నష్టమో తెలుసా?

Published Thu, Feb 23 2017 2:09 PM | Last Updated on Tue, Sep 5 2017 4:26 AM

జియో వల్ల ప్రభుత్వానికి  ఎంత నష్టమో తెలుసా?

జియో వల్ల ప్రభుత్వానికి ఎంత నష్టమో తెలుసా?

న్యూఢిల్లీ : ఆఫర్ల మీద ఆఫర్లు గుప్పిస్తున్న రిలయన్స్ జియో వల్ల ఇటు టెలికాం కంపెనీలకే కాదు, అటు ప్రభుత్వానికి భారీగానే నష్టం వాటిల్లుతోంది. జియో ఉచిత డేటా, ఉచిత వాయిస్ సర్వీసులతో ప్రభుత్వం రూ.685 కోట్లను వదులుకోవాల్సి వచ్చిందని టెలికాం కమిషన్ వెల్లడించింది.. నిర్దేశించిన సమయానికి మించి ఆఫర్లను అందిస్తుండటంతో సెక్టార్ నష్టపోతున్నట్టు పేర్కొంది.  ఈ విషయంపై మొట్టమొదటిసారి స్పందించిన టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్,  జియో బ్యాక్ టూ బ్యాక్ ప్రమోషనల్ ఆఫర్లు, ఈ ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్లో ప్రభుత్వంపై పడిన ప్రభావాన్ని వివరించింది.  పరిశ్రమ వృద్ధికి తోడ్పడేలా ప్రస్తుత నిబంధనలను సమీక్షించాలని, ప్రమోషనల్‌ టారిఫ్‌లకు సంబంధించిన ఆదేశాలు తూచా తప్పకుండా అమలయ్యేలా చూడాలని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌కి కమిషన్ సూచించింది. 
 
సెప్టెంబర్ 5 నుంచి జియో ఉచిత వాయిస్, డేటా ఆఫర్లు ఇవ్వడం ప్రారంభించింది. దీంతో అప్పటినుంచి ఇతర టెలికాం కంపెనీలు భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్ లు తమ కస్టమర్లను కాపాడుకోవడానికి భారీగా రేట్లు తగ్గిస్తూ వస్తున్నాయి. దీంతో వాటి రెవెన్యూలకు భారీగా గండిపడింది. కంపెనీల రెవెన్యూలను ఆధారంగానే ప్రభుత్వం లైసెన్సు ఫీజులను, స్పెక్ట్రమ్ ఛార్జీలను వసూలు చేస్తోంది. ప్రస్తుతం వీటి రెవెన్యూలు పడిపోతుండటంతో ప్రభుత్వానికి కూడా నష్టాలు పెరిగిపోతున్నాయి.

టెలికాం కంపెనీల రెవెన్యూలు మరో 8-10 శాతం క్షీణించే అవకాశముందని మార్కెట్ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కమిషన్, 2002, 2008 నిర్ణయించిన ప్రమోషనల్ ఆఫర్లను ట్రాయ్ కచ్చితంగా అప్లయ్ చేయాలని ఆదేశించింది.  ట్రాయ్  2002లో తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రమోషనల్ ఆఫర్ 90 రోజులకు మించి ఉండకూడదు. కానీ జియో తన ఉచిత ఆఫర్లను వివిధ పేర్లతో పొడిగిస్తూ వస్తోంది. ఈ విషయంపై టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ కూడా లీగల్ గా సవాల్ చేసింది. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement