data services
-
విస్తారా విమానాల్లో డేటా సర్వీసులు
న్యూఢిల్లీ: విస్తార ఎయిర్‌లైన్స్ కంపెనీ త్వరలోనే తన విమానాల్లో డేటా సర్వీసులను అందించనున్నది. భారత్‌లో విమానాల్లో డేటా సర్వీసులను అందించనున్న తొలి విమానయాన సంస్థ విస్తార కానున్నది. విమానాల్లో డేటా సర్వీసులను అందించడం కోసం విస్తార కంపెనీ టాటా గ్రూప్‌నకు చెందిన నెల్కోతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని కోసం ఈ సంస్థలు ఇస్రో నుంచి ఒక ట్రాన్స్‌పాండర్‌ను తీసుకున్నాయని, దీనికి అవసరమైన స్పెక్ట్రమ్‌ను కేటాయించాలని తమను కోరాయని టెలికం కార్యదర్శి అన్షు ప్రకాశ్ తెలిపారు. ఈ సంస్థలు కోరిన స్పెక్ట్రమ్‌ను కేటాయించామని, వీలైనంత త్వరలోనే విస్తార విమానయాన సంస్థ, తన విమానాల్లో డేటా సర్వీసులను అందించనున్నదని ఆయన వివరించారు. డేటా సర్వీసులే ముందు... వాయిస్ కాల్స్ కంటే ముందు డేటా సేవలు అందుబాటులోకి వస్తాయని, దీంతో ఓవర్–ద–టాప్(ఓటీసీ) సేవలు పొందవచ్చని, వాట్సాప్ కాల్స్ చేసుకోవచ్చని ప్రకాశ్ పేర్కొన్నారు. వీటి టారిఫ్‌ల నియంత్రణ ప్రభుత్వ పరిధిలో ఉండదని తెలిపారు. ఈ సేవలను ఉచితంగా అందించాలో, లేదా డబ్బులు వసూలు చేయాలో ఆ యా సంస్థలే నిర్ణయిస్తాయని వివరించారు. కాగా విమానాల్లో డేటా సర్వీసులను ఎప్పటి నుంచి అందుబాటులోకి తెచ్చేది ఇంకా ఖరారు చేయలేదని విస్తార ప్రతినిధి పేర్కొన్నారు. 2015లో కార్యకలాపాలు ప్రారంభించిన విస్తార ప్రస్తుతం 39 విమానాలతో రోజుకు 200 విమాన సర్వీసులను నిర్వహిస్తోంది. ఈ కంపెనీలో టాటా సన్స్‌కు 51% వాటా, మిగిలింది సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు ఉంది. -
డేటా సేవల మరో సంచలనం: వైఫై డబ్బా
సాక్షి, బెంగళూరు: ఉచిత డేటా, కాలింగ్ సేవలతో ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో ఇన్ఫోకాం ప్రత్యర్థి కంపెనీలకు దడ పుట్టించింది. అయితే ఉచిత సేవలకు స్వస్తి చెప్పి.. బాదుడుకు సిద్ధమైన జియోకి షాకిస్తూ ఒక కొత్త స్టార్ట్అప్ దూసుకుపోతోంది. రూ.2 ఉంటే చాలు సూపర్ చీప్ అండ్ సూపర్ ఫాస్ట్ డేటా అంటోంది బెంగళూరుకు చెందిన స్టార్ట్అప్ కంపెనీ వై ఫై డబ్బా. ఇది ప్రారంభమేకానీ.. టెలికాం దిగ్గజాలతో ఢీకొనేలా పక్కా ప్లాన్‌తో వ్యవస్థాపకులు సిద్ధమవుతున్నారు. బెంగళూరు నగరంలో ఐఎస్పీ లైసెన్స్‌తో ఫైబర్ ఆప్టిక్స్ ద్వారా డేటా సేవలు అందిస్తున్న వైఫై డబ్బా, జియో ప్లాన్లతో పోలిస్తే ఇప్పటికే భారీగా వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ప్రీ పెయిడ్ కస్టమర్లకు సరసమైన ధరల్లో డేటా ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. ఉదాహరణకు జియో రూ.19 లపై 150 ఎంబీ అందిస్తోంటే.. కేవలం రూ.2లకే 100 ఎంబీ డేటా ఆఫర్ చేస్తోంది. అలాగే రూ.10లకే 500ఎంబీ, రూ.20లకు 1 జీబీ డేటా అందిస్తోంది. దిగ్గజ టెలికాం కంపెనీల్లాగా లక్షలు ఖర్చుపెట్టి సెల్ టవర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేకుండా.. రూ. 4వేలతో ఒక డబ్బా(రౌటర్) ద్వారా తమ సేవలను విస్తరిస్తోంది. అతి తక్కువ ఖర్చుతో అతి వేగవంతమైన డేటా అందించడమే తమ లక్ష్యమని వైఫై డబ్బా ఫౌండర్ శర్మ చెబుతున్నారు. అంతేకాదు ఎలాంటి యాప్ ను డౌన్ లోన్ చేసుకోమని తాము వినియోగదారులకు కోరడం లేదన్నారు. వంద నుంచి 200మీటర్ల పరిధిలో 50బీపీఎస్‌తో రిలయబుల్ సేవల్ని అందిస్తున్నట్టు తెలిపారు. విభిన వర్గాలనుంచి తమకు కస్టమర్లు ఉన్నారన్నారు. ముఖ్యంగా అల్పాదాయ వర్గాల వారికి తమ డేటా సేవలు బాగా చేరుతున్నాయని తెలిపారు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఉన్న రోజువారీ వేతన కార్మికులను తమ ప్లాన్లు ఆకర్షిస్తున్నాయన్నారు. ఇప్పటికే బెంగళూరు నగరంలో 350రౌటర్ లేదా డబ్బాలను అమర్చగా... ఇంకా 1800 అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయట. ప్రస్తుతం స్థానిక్ కేబుల్ ఆపరేటర్ల భాగస్వామ్యంతో ఈ సేవలను అందిస్తోంది. కొత్త కనెక్షన్ కోసం 5-7రోజుల సమయంపడుతోందని..త్వరలోనే దీన్ని 3-4రోజులకు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని శర్మ చెప్పారు.. అలాగే రాబోయే 3-4 ఏళ్లలో లక్షల వైఫై డబ్బాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు చెప్పారు. కాగా వైఫై డబ్బాకి ప్రస్తుతం వై కాంబినేటర్ సహా కొన్ని సంస్థలు ఇన్వెస్టర్లుగా ఉన్నాయి -
జియో వల్ల ప్రభుత్వానికి ఎంత నష్టమో తెలుసా?
-
జియో వల్ల ప్రభుత్వానికి ఎంత నష్టమో తెలుసా?
న్యూఢిల్లీ : ఆఫర్ల మీద ఆఫర్లు గుప్పిస్తున్న రిలయన్స్ జియో వల్ల ఇటు టెలికాం కంపెనీలకే కాదు, అటు ప్రభుత్వానికి భారీగానే నష్టం వాటిల్లుతోంది. జియో ఉచిత డేటా, ఉచిత వాయిస్ సర్వీసులతో ప్రభుత్వం రూ.685 కోట్లను వదులుకోవాల్సి వచ్చిందని టెలికాం కమిషన్ వెల్లడించింది.. నిర్దేశించిన సమయానికి మించి ఆఫర్లను అందిస్తుండటంతో సెక్టార్ నష్టపోతున్నట్టు పేర్కొంది. ఈ విషయంపై మొట్టమొదటిసారి స్పందించిన టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్, జియో బ్యాక్ టూ బ్యాక్ ప్రమోషనల్ ఆఫర్లు, ఈ ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్లో ప్రభుత్వంపై పడిన ప్రభావాన్ని వివరించింది. పరిశ్రమ వృద్ధికి తోడ్పడేలా ప్రస్తుత నిబంధనలను సమీక్షించాలని, ప్రమోషనల్ టారిఫ్‌లకు సంబంధించిన ఆదేశాలు తూచా తప్పకుండా అమలయ్యేలా చూడాలని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌కి కమిషన్ సూచించింది. సెప్టెంబర్ 5 నుంచి జియో ఉచిత వాయిస్, డేటా ఆఫర్లు ఇవ్వడం ప్రారంభించింది. దీంతో అప్పటినుంచి ఇతర టెలికాం కంపెనీలు భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్ లు తమ కస్టమర్లను కాపాడుకోవడానికి భారీగా రేట్లు తగ్గిస్తూ వస్తున్నాయి. దీంతో వాటి రెవెన్యూలకు భారీగా గండిపడింది. కంపెనీల రెవెన్యూలను ఆధారంగానే ప్రభుత్వం లైసెన్సు ఫీజులను, స్పెక్ట్రమ్ ఛార్జీలను వసూలు చేస్తోంది. ప్రస్తుతం వీటి రెవెన్యూలు పడిపోతుండటంతో ప్రభుత్వానికి కూడా నష్టాలు పెరిగిపోతున్నాయి. టెలికాం కంపెనీల రెవెన్యూలు మరో 8-10 శాతం క్షీణించే అవకాశముందని మార్కెట్ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కమిషన్, 2002, 2008 నిర్ణయించిన ప్రమోషనల్ ఆఫర్లను ట్రాయ్ కచ్చితంగా అప్లయ్ చేయాలని ఆదేశించింది. ట్రాయ్ 2002లో తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రమోషనల్ ఆఫర్ 90 రోజులకు మించి ఉండకూడదు. కానీ జియో తన ఉచిత ఆఫర్లను వివిధ పేర్లతో పొడిగిస్తూ వస్తోంది. ఈ విషయంపై టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ కూడా లీగల్ గా సవాల్ చేసింది. -
జమ్మూకశ్మీర్ లో ఇంటర్నెట్ బంద్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ ప్రజలు ఇంటర్నెట్ లేకుండా బక్రీద్ పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. రెండు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిపి వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి శనివారం రాత్రి 10 గంటలకు ఇంటర్నెట్ సేవలు నిలిపోనున్నాయి. అసాంఘిక శక్తులు మతవిద్వేషాలు రెచ్చగొట్టే అవకాశముందని భావించి ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. బక్రీద్ పండుగ, ఎద్దు మాంసంపై నిషేధం నేపథ్యంలో రెండు రోజుల పాటు డేటా సేవలు నిలిపి వేయాలని ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లను డీజీపీ(కశ్మీర్) ఎస్ జేఎం గిలానీ ఆదేశించారు. డేటా సేవలు నిలిపివేయడంతో ఇంటర్నెట్ లో వీడియోలు అప్ లోడ్ చేయడం, సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్లను ఓపెన్ చేయడం సాధ్యం కాదు. -
యూజర్ చెబితేనే ఫోన్లో నెట్ యాక్టివేషన్
న్యూఢిల్లీ : డేటా సేవలకు టెల్కోలు అడ్డగోలుగా వసూలు చేస్తున్నాయంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో నియంత్రణ సంస్థ ట్రాయ్ స్పందించింది. యూజర్ల నుంచి స్పష్టమైన అంగీకారం పొందిన తర్వాతే టెల్కోలు వారి మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ను యాక్టివేట్ చేయాలని ప్రతిపాదించింది. అలాగే వాడకం పరిమితులు నిర్దిష్ట స్థాయిలకు దగ్గరపడగానే ఎస్ఎంఎస్/టోల్ ఫ్రీ కోడ్ ద్వారా యూజర్లకు సమాచారాన్ని తెలియజేయాలి. ఇంటర్నేషనల్ రోమింగ్‌లో ఉన్న యూజర్లు డేటా సర్వీసులు వాడదల్చుకోని పక్షంలో వాటిని డీయాక్టివేట్ చేసుకునేలా కూడా అలర్ట్‌లు పంపాలని తెలిపింది. డేటా సేవలపై రూపొందించిన ముసాయిదా నిబంధనలను ట్రాయ్ బుధవారం విడుదల చేసింది. వీటిపై సంబంధిత వర్గాలు మే 12 లోగా తమ అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుంది. యూజర్ అనుమతుల మేరకు డేటా సర్వీసుల ను యాక్టివేట్/డీయాక్టివేట్ చేయాలన్నా టోల్ ఫ్రీ కోడ్ 1925(యూఎస్ఎస్డీ)ని ఉపయోగించవచ్చని ట్రాయ్ పేర్కొంది.