కేజ్రీవాల్ కు చుక్కెదురు | Kejriwal stopped by judge from addressing lawyers in court complex | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్ కు చుక్కెదురు

Published Fri, Dec 19 2014 8:20 PM | Last Updated on Tue, Aug 14 2018 3:47 PM

కేజ్రీవాల్ కు చుక్కెదురు - Sakshi

కేజ్రీవాల్ కు చుక్కెదురు

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ద్వారకా జిల్లా కోర్టులో చుక్కెదురైంది. ఆయన ప్రసంగించకుండా న్యాయమూర్తి అడ్డుకున్నారు. కోర్టు ప్రాంగణాన్ని రాజకీయాలకు వేదిక చేయొద్దని చురక అంటించారు.

ద్వారకా కోర్టు బార్ అసోసియేషన్(డీసీబీఏ) కోర్టు ప్రాంగణంలో కేజ్రీవాల్ సభ ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న న్యాయమూర్తి రవీందర్ కౌర్ కోర్టు ప్రాంగణాన్ని రాజకీయాలకు వేదిక కాకుండా చూడాలని పోలీసులను, సిబ్బందిని ఆదేశించారు. సభకు అనుమతి కూడా ఇవ్వలేదు. దీంతో జడ్జికి వ్యతిరేకంగా న్యాయవాదులు ఆందోళనకు దిగి, నినాదాలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement