న్యూయార్క్: పెన్సిల్వేనియాలో సంప్రదాయ వస్తువు(క్రిపన్)తో షాపింగ్ కు వెళ్లిన ఓ సిక్కు మతస్తుడికి అవమానం జరిగింది. పెద్ద కత్తితో ఓ దుండగుడు షాపింగ్ మాల్ లో సంచరిస్తున్నాడని ఆ దేశ పౌరులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు అతన్ని చుట్టుముట్టారు. ఈ ఘటనపై మాట్లాడిన బాధితుడు హర్పీత్ సింగ్ ఖస్లా(33) తనపై జాతి వివక్ష చర్య అని ఆరోపించారు.
షాపింగ్ మాల్ లోని పార్క్ చేసిన తన వ్యాన్ లో కూర్చున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో పోలీసులు చుట్టుముట్టినట్లు చెప్పారు. రెండు చేతులను తల వెనక్కుపెట్టుకోవాలని సూచించారని తెలిపారు. అంతమంది పోలీసులు ఒకేసారి చుట్టుముట్టడంతో తాను షాక్ కు గురైనట్లు చెప్పారు. మేరీల్యాండ్ నుంచి విహారయాత్రకు పెన్సిల్వేనియాకు వచ్చినట్లు పేర్కొన్నారు.
షాపింగ్ మాల్ కు వెళ్లిన సమయంలో తన వద్ద ఎలాంటి కత్తి లేదని.. కేవలం క్రిపన్ ను మాత్రమే ధరించినట్లు చెప్పారు. న్యూయార్క్, మిన్నెసోటా సంఘటనల తర్వాత పౌరులు జాగ్రత్తగా ఉంటున్నట్లు ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు. సాధారణ విషయాలకు భిన్నంగా కనిపించే ప్రతిదానిని అనుమానిస్తున్నట్లు చెప్పారు. మాల్ లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నాడని చాలా ఫోన్ కాల్స్ రావడం వల్లే ఆఫీసర్లు గ్రూప్ గా అక్కడికి వెళ్లినట్లు వెల్లడించారు. వాళ్లు చేసింది మంచి పనేనని అన్నారు. కాగా, ఖస్లా కిర్పాన్ ను పోలీసులు తిరిగి ఇచ్చేశారు. ఆయనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు.
అమెరికాలో సిక్కు మతస్తుడిపై జాతి వివక్ష?
Published Thu, Sep 22 2016 7:22 PM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM
Advertisement