kripan
-
వియత్నాంకు కానుకగా మన యుద్ధనౌక
న్యూఢిల్లీ: వియత్నాంకు భారత్ అరుదైన కానుక అందించింది. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి నిదర్శనంగా ఐఎన్ఎస్ కృపాణ్ యుద్ధనౌకను బహుమతిగా ఇచి్చంది. దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆధిపత్యంపై ఇరు దేశాల్లో నెలకొన్న ఆందోళనల్ని దృష్టిలో ఉంచుకొని తీర ప్రాంతంలో గస్తీని బలోపేతం చేయడం దీని ఉద్దేశమంటున్నారు. పూర్తి సామర్థ్యంతో పని చేసే యుద్ధ నౌకను ఒక మిత్రదేశానికి భారత్ కానుకగా ఇవ్వడం ఇదే తొలిసారని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ వెల్లడించారు. వియత్నాం పర్యటనలో ఉన్న ఆయన శనివారం బే ఆఫ్ కామ్ రన్హ్ జలాల్లో జరిగిన కార్యక్రమంలో ఐఎన్ఎస్ కృపాణ్ను ఆ దేశానికి అందజేశారు. పూర్తిస్థాయి ఆయుధాలతో కూడిన నౌకను ఆ దేశ నేవీకి అప్పగించినట్టు వివరించారు. భారత్ జీ20 సదస్సు ప్రధాన థీమ్ అయిన వసుధైక కుటుంబం (ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్)లో భాగంగానే ఈ కానుక ఇచ్చినట్టు తెలిపారు. ఐఎన్ఎస్ కృపాణ్ గస్తీతో దక్షిణ చైనా జలాల్లో అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా అన్ని దేశాలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐఎన్ఎస్ కృపాణ్ జూన్ 28న విశాఖపట్నం నుంచి బయల్దేరి జూలై 8 నాటికి వియత్నాం చేరింది. -
అమెరికాలో సిక్కు మతస్తుడిపై జాతి వివక్ష?
న్యూయార్క్: పెన్సిల్వేనియాలో సంప్రదాయ వస్తువు(క్రిపన్)తో షాపింగ్ కు వెళ్లిన ఓ సిక్కు మతస్తుడికి అవమానం జరిగింది. పెద్ద కత్తితో ఓ దుండగుడు షాపింగ్ మాల్ లో సంచరిస్తున్నాడని ఆ దేశ పౌరులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు అతన్ని చుట్టుముట్టారు. ఈ ఘటనపై మాట్లాడిన బాధితుడు హర్పీత్ సింగ్ ఖస్లా(33) తనపై జాతి వివక్ష చర్య అని ఆరోపించారు. షాపింగ్ మాల్ లోని పార్క్ చేసిన తన వ్యాన్ లో కూర్చున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో పోలీసులు చుట్టుముట్టినట్లు చెప్పారు. రెండు చేతులను తల వెనక్కుపెట్టుకోవాలని సూచించారని తెలిపారు. అంతమంది పోలీసులు ఒకేసారి చుట్టుముట్టడంతో తాను షాక్ కు గురైనట్లు చెప్పారు. మేరీల్యాండ్ నుంచి విహారయాత్రకు పెన్సిల్వేనియాకు వచ్చినట్లు పేర్కొన్నారు. షాపింగ్ మాల్ కు వెళ్లిన సమయంలో తన వద్ద ఎలాంటి కత్తి లేదని.. కేవలం క్రిపన్ ను మాత్రమే ధరించినట్లు చెప్పారు. న్యూయార్క్, మిన్నెసోటా సంఘటనల తర్వాత పౌరులు జాగ్రత్తగా ఉంటున్నట్లు ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు. సాధారణ విషయాలకు భిన్నంగా కనిపించే ప్రతిదానిని అనుమానిస్తున్నట్లు చెప్పారు. మాల్ లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నాడని చాలా ఫోన్ కాల్స్ రావడం వల్లే ఆఫీసర్లు గ్రూప్ గా అక్కడికి వెళ్లినట్లు వెల్లడించారు. వాళ్లు చేసింది మంచి పనేనని అన్నారు. కాగా, ఖస్లా కిర్పాన్ ను పోలీసులు తిరిగి ఇచ్చేశారు. ఆయనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు.