దేశంలో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్) సానుభూతిపరులకు ఆర్థికసాయం చేస్తున్న వ్యక్తిని కువైట్ ప్రభుత్వ సాయంతో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు పట్టుకున్నారు. 2014లో తనతో పాటు మరో ముగ్గురు స్నేహితులను ఇరాక్ తీసుకెళ్లిన అరీబ్ మజీద్ ఇచ్చిన సమాచారంతో కువైట్ కు చెందిన అబ్దుల్లా హది అబ్దుల్ రెహమాన్ అల్ ఏనేజి అనే వ్యక్తిని అధికారులు అరెస్టు చేయించారు.
2014 మే నెలలో ఐసిస్ కు వెళ్లిన ఈ నలుగురు నవంబర్ లో తిరిగి భారత్ కు వచ్చారు. వీరిపై నిఘా ఉంచిన అధికారులు ఎయిర్ పోర్టులో వారిని అరెస్టు చేశారు. సిరియాకు వెళ్లడానికి కొంత డబ్బు అవసరమని ఐసిస్ హ్యండ్లర్ ను వీరు కోరగా.. కువైట్ నుంచి వెయ్యి డాలర్లు వచ్చాయని విచారణలో చెప్పారు. దీనిపై ఎన్ఏఐ కువైట్ ప్రభుత్వానికి లేఖ రాసింది. రంగంలోకి దిగిన ప్రభుత్వం ఏనేజిని విచారించి అరెస్టు చేసింది.
ఎన్ఐఏకు చెందిన అధికారులు అతన్నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు కువైట్ కు వెళ్లే అవకాశం ఉంది. ఐఎస్ఐఎస్ స్కూల్ నుంచి అరీబ్ భారతదేశం నుంచి మొదటి గ్రాడ్యుయేట్. సివిల్ ఇంజనీర్ గా ట్రైనింగ్ తీసుకున్న అతన్ని సూసైడ్ బాంబర్ గా ఐసిస్ ఎంపిక చేసినట్లు చెప్పాడు. పోలీసులకు దొరికిపోయే ముందు మూడుసార్లు సూసైడ్ బాంబ్ యత్నాలు చేసి విఫలమైనట్లు ఒప్పుకున్నాడు.
కువైట్లో ఐసిస్ సానుభూతిపరుడు అరెస్ట్
Published Sat, Aug 6 2016 3:50 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM
Advertisement