ISIS Sympathisers
-
కువైట్లో ఐసిస్ సానుభూతిపరుడు అరెస్ట్
దేశంలో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్) సానుభూతిపరులకు ఆర్థికసాయం చేస్తున్న వ్యక్తిని కువైట్ ప్రభుత్వ సాయంతో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు పట్టుకున్నారు. 2014లో తనతో పాటు మరో ముగ్గురు స్నేహితులను ఇరాక్ తీసుకెళ్లిన అరీబ్ మజీద్ ఇచ్చిన సమాచారంతో కువైట్ కు చెందిన అబ్దుల్లా హది అబ్దుల్ రెహమాన్ అల్ ఏనేజి అనే వ్యక్తిని అధికారులు అరెస్టు చేయించారు. 2014 మే నెలలో ఐసిస్ కు వెళ్లిన ఈ నలుగురు నవంబర్ లో తిరిగి భారత్ కు వచ్చారు. వీరిపై నిఘా ఉంచిన అధికారులు ఎయిర్ పోర్టులో వారిని అరెస్టు చేశారు. సిరియాకు వెళ్లడానికి కొంత డబ్బు అవసరమని ఐసిస్ హ్యండ్లర్ ను వీరు కోరగా.. కువైట్ నుంచి వెయ్యి డాలర్లు వచ్చాయని విచారణలో చెప్పారు. దీనిపై ఎన్ఏఐ కువైట్ ప్రభుత్వానికి లేఖ రాసింది. రంగంలోకి దిగిన ప్రభుత్వం ఏనేజిని విచారించి అరెస్టు చేసింది. ఎన్ఐఏకు చెందిన అధికారులు అతన్నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు కువైట్ కు వెళ్లే అవకాశం ఉంది. ఐఎస్ఐఎస్ స్కూల్ నుంచి అరీబ్ భారతదేశం నుంచి మొదటి గ్రాడ్యుయేట్. సివిల్ ఇంజనీర్ గా ట్రైనింగ్ తీసుకున్న అతన్ని సూసైడ్ బాంబర్ గా ఐసిస్ ఎంపిక చేసినట్లు చెప్పాడు. పోలీసులకు దొరికిపోయే ముందు మూడుసార్లు సూసైడ్ బాంబ్ యత్నాలు చేసి విఫలమైనట్లు ఒప్పుకున్నాడు. -
'అనంత'లో ఉగ్రవాదుల కీలక పత్రాలు లభ్యం
అనంతపురం: గత వారం హైదరాబాద్ లో కొందరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న తర్వాత ఇరు రాష్ట్రాల పోలీసులు, భద్రతా అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. తాజాగా అనంతపురంలో ఐసిస్ ఉగ్రవాదుల కదలికలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తు చేపట్టింది. బస్టాండ్ సమీపంలోని నంది రెసిడెన్సిలో సోదాలు నిర్వహించి లాడ్జి నుంచి ఉగ్రవాదుల ఐడీ ప్రూఫ్స్, లాగ్ ఇన్ రిజిస్టర్, మరికొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ లో అరెస్టయిన ఐసిస్ సానుభూతిపరులను అనంతపురం పట్టణానికి తీసుకొచ్చి అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తుపాకీ కొనుగోలు చేసేందుకు ఇద్దరు ఐసిస్ సానుభూతిపరులు ఇక్కడికి వచ్చారని వివరించారు. హైదరాబాద్ నగరంలో పేలుళ్లకు కుట్ర పన్నిన 11 మంది అనుమానిత ఉగ్రవాదులను జూన్ 29న ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. -
హైదరాబాద్ లో మరోసారి కలకలం
రంజాన్ కు ముందు రోజు హైదరాబాద్ పాత నగరంలో మరోసారి కలకలం రేగింది. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మరోసారి సోదాలు నిర్వహించింది. ఇటీవల పట్టుబడి పోలీసులు అదుపులో ఉన్న ఇస్లామిక్ స్టేట్ సానుభూతిపరులు ఇచ్చిన సమాచారం ఆధారంగా పాతబస్తీలోని తలాబ్ కట్టా, బార్కాస్ లో ఎన్ఐఏ అధికారులు మంగళవారం సోదాలు జరిపారు. 17 బుల్లెట్లు, 2 స్కానర్లు కంప్యూటర్ స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ లోనూ ఎన్ఐఏ అధికారులు చేపట్టి నలుగురు అనుమానితులను అరెస్ట్ చేశారు. మరికొన్ని నగరల్లోనూ ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించనున్నారని సమాచారం. హైదరాబాద్ నగరంలో పేలుళ్లకు కుట్ర పన్నిన 11 మంది అనుమానిత ఉగ్రవాదులు జూన్ 29న ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిలో ఆరుగురిని సాక్షులు మార్చి తర్వాత వదిలిపెట్టారు. అరెస్టైన ఐదుగురికి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. హైదరాబాద్ నగరంలో వారాంతంలో పేలుళ్లు, విధ్వంసాలకు వీరు కుట్ర పనినట్టు వెల్లడైంది.