హైదరాబాద్ లో మరోసారి కలకలం
రంజాన్ కు ముందు రోజు హైదరాబాద్ పాత నగరంలో మరోసారి కలకలం రేగింది. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మరోసారి సోదాలు నిర్వహించింది. ఇటీవల పట్టుబడి పోలీసులు అదుపులో ఉన్న ఇస్లామిక్ స్టేట్ సానుభూతిపరులు ఇచ్చిన సమాచారం ఆధారంగా పాతబస్తీలోని తలాబ్ కట్టా, బార్కాస్ లో ఎన్ఐఏ అధికారులు మంగళవారం సోదాలు జరిపారు. 17 బుల్లెట్లు, 2 స్కానర్లు కంప్యూటర్ స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ లోనూ ఎన్ఐఏ అధికారులు చేపట్టి నలుగురు అనుమానితులను అరెస్ట్ చేశారు. మరికొన్ని నగరల్లోనూ ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించనున్నారని సమాచారం.
హైదరాబాద్ నగరంలో పేలుళ్లకు కుట్ర పన్నిన 11 మంది అనుమానిత ఉగ్రవాదులు జూన్ 29న ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిలో ఆరుగురిని సాక్షులు మార్చి తర్వాత వదిలిపెట్టారు. అరెస్టైన ఐదుగురికి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. హైదరాబాద్ నగరంలో వారాంతంలో పేలుళ్లు, విధ్వంసాలకు వీరు కుట్ర పనినట్టు వెల్లడైంది.