ముంబై: రికార్డుస్థాయిలో సబ్‌స్క్రైబ్ అయిన లార్సెన్ అండ్ టుబ్రో ఇన్ఫోటెక్ నేటి (జూలై 21 గురువారం) నుంచి స్టాక్ మార్కెట్ లో తెరంగేట్రం చేయనుంది. ఈ కంపెనీ షేర్లు ప్రముఖ స్టాక్ ఎక్సేంజ్ ఎన్ఎస్ఇ , బిఎస్ఇ లో లిస్ట్ కానుంది. గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఛైర్మన్ ఎఎం నాయక్ , ఇతర ఉన్నతాధికారులతోపాటు మర్చంట్ బ్యాంకర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 887 మిలియన్ డాలర్ల ఆదాయంతో 20 వేల మంది ఉద్యోగులతో ఐటీ సేవల్లో ఆరవ అతి పెద్ద సంస్థగా ఉంది ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ . తాజా ఐపీవో లో భారీ స్థాయిలో మిలియన్ అప్లికేషన్లు సాధించిందనీ, 2011 నుండి ఇప్పటివరకు ఒక షేర్ ఇంత పెద్ద మొత్తంలో అప్లికేషన్లు ఆకర్షించడం ఇదే మొదటిసారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
గత బుధవారంతో ముగిసిన ఐపీఓ లో 12 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయిన ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ షేరు ధరను రూ.705-710గా కంపెనీ నిర్ణయించింది. రిటైల్ ఇన్వెస్టర్లకు రూ.10 డిస్కౌంట్‌ను కంపెనీ ఆఫర్ చేసింది. ఇంజనీరింగ్ దిగ్గజం ఎల్ అండ్ టీ ఐటీ అనుబంధ కంపెనీ అయిన ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బీమా, ఎనర్జీ పరిశ్రమలకు ఐటీ సొల్యూషన్లనందిస్తున్నది.
కాగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్, రిలయన్స్ క్యాపిటల్, న్యూ ఇండియా ఎష్యూరెన్స్, అబర్న్... యాంకర్ ఇన్వెస్టర్లలో కొన్ని సంస్థలు. ఈ ఐపీఓకు లీడ్ మేనేజర్లుగా సిటిగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్, కోటక్ మహీంద్రా క్యాపిటల్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ వ్యవహరించిన సంగతి తెలిసిందే.
ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ స్టాక్మార్కెట్ ఎంట్రీ
Published Thu, Jul 21 2016 8:46 AM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM
Advertisement
Advertisement