ఆ స్థలం..ఆ చెట్టుదే! | land registration for tree | Sakshi
Sakshi News home page

ఆ స్థలం..ఆ చెట్టుదే!

Published Wed, Oct 14 2015 10:28 AM | Last Updated on Sun, Sep 3 2017 10:57 AM

ఆ స్థలం..ఆ చెట్టుదే!

ఆ స్థలం..ఆ చెట్టుదే!

జార్జియా: రోడ్డు విస్తరణ పనులకు అడ్డంగా ఉన్న చెట్లను తొలగించడం మనం చూస్తుంటాం.. కానీ ఈ వృక్షాన్ని మాత్రం తొలగించలేరు. ఎందుకంటే.. ఈ చెట్టున్న భూమి ఆ చెట్టుదే! అవును.. ఆ చెట్టు ఉన్న ల్యాండ్ తాలూకు లార్డ్ ఆ చెట్టే! మొదలు చుట్టూ ఉన్న దాదాపు 8 అడుగుల భూమి దానిదే. సొంత ఆస్తి కలిగిన చెట్టుగా పేరొందిన ఈ సింధూర వృక్షం అమెరికా జార్జియాలోని క్లార్క్ కౌంటీలో ఉంది. ఇంతకీ ఇదెలా సాధ్యం అంటే..  రింగులు తిప్పుకుంటూ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లాల్సిందే.

తొలిసారిగా ఈ విషయం గురించి 1890లో స్థానిక వార్తాపత్రికలో ఓ కథనం వచ్చింది. దాని ప్రకారం కల్నల్ విలియమ్ హెన్రీ అనే ఆయనకు ఈ ప్లేస్‌లో ఉన్న సింధూర వృక్షమంటే ఎంతో ఇష్టమట. తాను పోయిన తర్వాత కూడా ఈ చెట్టు ఇలాగే పచ్చగా ఉండాలని భావించిన ఆయన వెంటనే దీని చుట్టూ ఉన్న భూమిని కొనేసి.. దాని పేరిట రిజిస్టర్ చేయించేశారు. సరిగ్గా తెలియదు గానీ.. 1820-32 మధ్య కాలంలో ఈ రిజిస్ట్రేషన్ జరిగిందని సదరు పత్రికలో పేర్కొన్నారు. ఆ రిజిస్ట్రేషన్ పత్రాలను ఇప్పటివరకూ ఎవరూ చూడలేదు. వాటిని చూసిన ఏకైక వ్యక్తి 1890లో ఆ వార్తను రాసిన ఆయనేనట. అయితే.. ఆ పత్రాలు ఉన్నాయో లేవో ఎవరికీ తెలియనప్పటికీ.. ఆ రిజిస్ట్రేషన్ నిజంగా జరిగిందని.. అయితే పత్రాలు పోయి ఉంటాయని అందరూ బలంగా నమ్మారు.

చివరికి స్థానిక అధికార యంత్రాంగం కూడా ఆ స్థలం ఆ చెట్టుదేనని ధ్రువీకరించేసింది. అయితే, విలియం హెన్రీ ఏ చెట్టుకయితే.. ఈ భూమిని రాసిచ్చారో ఆ చెట్టు ఇప్పుడు లేదు. 1942లో వచ్చిన తుపానుకు 100 అడుగుల ఎత్తుండే ఆ వృక్షం కూలిపోయింది. అయితే.. అదెక్కడయితే కూలిందో.. అక్కడ మళ్లీ చిగురు వేసిందట. ప్రస్తుతం ఉన్నది అప్పటి సింధూర వృక్షం తాలూకు వారసుడన్నమాట.   దీంతో కామన్‌గానే వారసత్వంగా ఈ భూమి కూడా ‘సన్ ఆఫ్ ద ట్రీ’గా అక్కడి వాళ్లు పిలుచుకుంటున్న ప్రస్తుత చెట్టుకు కేటాయించేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement