
ఇద్దర్నే కనాలని చట్టం చేయాలి: తొగాడియా
బరేలీ: దంపతులకు ఇద్దరే సంతానం ఉండేలా చట్టాన్ని చేయాలని విశ్వహిందూ పరిషత్ నేత ప్రవీణ్ తొగాడియా మంగళవారం వ్యాఖ్యానించారు.
‘మైనారిటీల జనాభా పెరుగుతూనే ఉంది. దానిపై మాట్లాడితే వివాదం అవుతుంది. అందుకే ఇద్దరే పిల్లలు ఉండాలని ఒక చట్టం చేస్తే సరిపోతుంది’ అన్నా రు. బరేలీలో జరిగిన వీహెచ్‌పీ 50వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు.