చరిత్రలో నిలిచిపోయిన హీరో.. | Lawrence to build temple for his mother | Sakshi
Sakshi News home page

చరిత్రలో నిలిచిపోయిన హీరో..

Published Sun, May 14 2017 8:31 PM | Last Updated on Tue, Sep 5 2017 11:09 AM

చరిత్రలో నిలిచిపోయిన హీరో..

చరిత్రలో నిలిచిపోయిన హీరో..

మాతృమూర్తికి గుడి కట్టించడం అన్నది అరుదైన విషయం. అదీ అమ్మ జీవించి ఉండగానే ఆమెకు ఆలయం నిర్మించడం అన్నది ఇప్పటి వరకూ జరిగి ఉండదు. అయితే నృత్య దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్‌ తన తల్లి కన్మణికి ఆలయాన్ని నిర్మించి చరిత్రలో నిలిచిపోయారు. చెన్నై,అంబత్తూర్‌ సమీపంలోని తిరుముల్లైవాయిల్‌లో ఇంతకు ముందే శ్రీరాఘవేంద్రస్వామి ఆలయాన్ని నిర్మించిన రాఘవలారెన్స్‌ ఇప్పుడు ఆ పక్కనే తన తల్లికి గుడి కట్టించారు.

ఆ గుడిలో గాయత్రిదేవి విగ్రహాన్ని, శివలింగాన్ని కూడా కట్టించారు. మాతృదినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం తన మాతృమూర్తి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని వేద పండితుల విశేష పూజల మధ్య నిర్వహించారు. అనంతం సహస్య స్త్రీలకు చీరల దానం చేశారు.‘ ముని, కాంచన, గంగ, శివలింగ... ఇలా వరుసగా హారర్‌ థ్రిల్లర్స్‌ చేసి, ప్రేక్షకులకు దడ పుట్టిస్తున్నారు. అదే విధంగా మాతృమూర్తికి ఆలయం కట్టించి ప్రజల గుండెల్లో ఒక స్థానం సంపాదించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement