లోక్సభ సమావేశాలు రేపటికి వాయిదా | Lok Sabha adjourned for the day amid continued uproar over motion to suspend 11 MPs | Sakshi
Sakshi News home page

లోక్సభ సమావేశాలు రేపటికి వాయిదా

Published Thu, Aug 22 2013 1:07 PM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

లోక్సభ సమావేశాలు రేపటికి వాయిదా - Sakshi

లోక్సభ సమావేశాలు రేపటికి వాయిదా

న్యూఢిల్లీ : విపక్ష సభ్యుల నిరసనల మధ్య లోక్సభ సమావేశాలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. అంతకు ముందు రాష్ట్ర విభజన అంశం లోక్సభను కుదిపేసింది. సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేయాలంటూ సీమాంధ్ర ఎంపీలు సభను అడ్డుకునేందుకు యత్నించారు. వెల్లోని దూసుకు వెళ్లి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ నినాదాలు చేశారు. స్పీకర్ మీరాకుమార్ తమ స్థానాల్లోకి వెళ్లాలని స్పీకర్ మీరాకుమార్ విజ్ఞప్తి చేసినా ఎంపీలు శాంతించకపోగా, స్పీకర్ మైకులను తోసేశారు.

 దాంతో అధికార పక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది.పార్లమెంట్ ముగిసేవరకూ 11 మంది సీమాంధ్ర ఎంపీలను సస్పెండ్ చేయాలని నిర్ణయించింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి కమల్నాథ్ సస్పెన్షన్ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. దాంతో ఏడుగురు కాంగ్రెస్, నలుగురు టీడీపీ ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. మొత్తం మీద సీమాంధ్ర ఎంపీల నిరసన నేపథ్యంలో తొలిసారి 15 నిముషాలు సభ వాయిదా పడగా, వాయిదా అనంతరం ఎలాంటి మార్పు లేకపోవటంతో లోక్సభ రేపటికి వాయిదా పడింది. మరోవైపు ఎంపీల సస్పెన్షన్ తీర్మానాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది.

సస్పెండ్ అయిన సభ్యుల వివరాలు
కాంగ్రెస్ ఎంపీలు:
1.లగడపాటి రాజగోపాల్
2. హర్షకుమార్
3.అనంత వెంకట్రామిరెడ్డి
4. సాయి ప్రతాప్
5. రాయపాటి సాంబశివరావు
6. ఉండవల్లి అరుణ్ కుమార్
7. మాగుంట శ్రీనివాసులురెడ్డి

టీడీపీ సభ్యులు
1.కొనకొళ్ల నారాయణరావు
2.మోదుగుల వేణుగోపాల్ రెడ్డి
3. శివప్రసాద్
4. నిమ్మల కిష్టప్ప .....
కాగా సస్పెన్షన్ జరిగే ముందే మరో ఎంపీ కనుమూరి బాపిరాజు సభ నుంచి వెళ్లిపోయారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement