మార్కెట్లపై ఝున్ ఝున్వాలా జోస్యం
మార్కెట్లపై ఝున్ ఝున్ వాలా జోస్యం
Published Tue, Aug 30 2016 2:32 PM | Last Updated on Mon, Oct 1 2018 5:32 PM
న్యూఢిల్లీ : దలాల్ స్ట్రీట్ సూచీల కదలికలు ఎప్పుడు ఎటువైపు సాగుతాయో ప్రతి ఒక్కరికీ సందేహమే. ఓ సారి టాప్లో ఎగుస్తాయి. మరోసారి ఢమాల్ మనిస్తాయి. సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్గా కీర్తి గడించిన రాకేశ్ జున్జున్వాలా మార్కెట్లో చూడబోతున్న ఆసక్తికరమైన అంశాలు మీడియాకు వివరించారు.. దలాల్ స్ట్రీట్లో బిగ్ బుల్ను చూడబోతున్నామని.. 2003లో చూసిన జోష్ను మార్కెట్లు ప్రతిబింబించబోతున్నాయని వెల్లడించారు. ప్రస్తుతం మార్కెట్లో పెట్టుబడిదారుల తక్కువగా పాల్గొనడం బుల్ మార్కెట్కు ప్రారంభదశలో ఉండటాన్ని సూచిస్తుందన్నారు. ఫెడరల్ రిజర్వు రేట్లు పెంచితేనే దేశీయ మార్కెట్లు కరెక్ట్ చెందుతాయన్నారు.
అమెరికా రేట్లు కూడా 1-1.5 శాతం కంటే ఎక్కువ పెరుగుతాయని అంచనావేయడం లేదని పేర్కొన్నారు. రేట్ల పెంపు లేనంత వరకు అంతర్జాతీయంగా మార్కెట్లలో ర్యాలీ ఇలానే కొనసాగుతుందని వెల్లడించారు. గ్లోబల్ ర్యాలీతో సెన్సెక్స్ ఫిబ్రవరి చివరి కల్లా 18 శాతం ఎగిసినట్టు తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో పేలవమైన ప్రదర్శనను కనబరుస్తున్న ఇండియన్ ఐటీ రంగంలో వృద్ధి కొనసాగింపును చూస్తామని.. కానీ ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది మాత్రం పెట్టుబడిదారులే నిర్ణయించుకోవాలని సూచించారు. గోల్డ్ మార్కెట్లో కూడా బుల్లిష్ ట్రెండ్ చూస్తామని తెలిపారు. ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకురావడానికి ఆర్బీఐ గవర్నర్ రాజన్ తీసుకున్న విధానాలు బాగున్నాయని వివరించారు. రాజన్ 8900 కోట్ల పోర్ట్ఫోలియో కలిగిన జున్జున్వాలా, ఇండియా వారెన్ బఫెట్గా పేరుగాంచారు.
Advertisement